యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేసిన రోషన్ కనకాల’మోగ్లీ 2025′ ఎపిక్ లవ్ & వార్ టీజర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్, సందీప్ రాజ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మోగ్లీ 2025’ ఎపిక్ లవ్ & వార్ టీజర్‌

బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ‘మోగ్లీ 2025’ తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్,  కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025 అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్ ప్రాజెక్ట్ పై బజ్‌ను మరింత పెంచింది.

హాయిగా సంతోషంగా జీవితాన్ని గడపాలనుకునే యువకుడు మోగ్లీ. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించిన తర్వాత అతని ప్రపంచం ఒక మలుపు తిరుగుతుంది. రామ–సీతల ప్రేమకథలా వీరిద్దరి ప్రేమ కూడా అందంగా ఉంటుంది. వీరి సంతోషంలో రాక్షసుడు లాంటి పోలీస్ ఆఫీసర్ ఎంటరౌతాడు. దీంతో అంతా యుద్ధ భూమిగా మారుతుంది

దర్శకుడు సందీప్ రాజ్ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. రామ–సీత లాగా హీరో–హీరోయిన్లను, రావణుడిలా విలన్‌ను చూపుతూ ఆధునిక రామాయణలా ప్రజెంట్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మైథాలజీ  ఫీల్ మోడరన్ ఎమోషన్ తో మిళితం చేస్తుంది.

రోషన్ కనకాలఅద్భుతంగా కనిపించాడు. తన పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని, కొత్త లుక్‌తో, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగులు సహజంగా ఆకట్టుకున్నాయి. అతనికి జోడీగా నటించిన సాక్షి మదోల్కర్ చెవిటి–మూగ అమ్మాయి సహజంగా నటించింది. ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల మనసు తాకింది. విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇంటెన్స్ గా కనిపించగా, హీరో స్నేహితుడిగా వైవా హర్ష తన కూల్ హ్యుమర్ తో అలరించాడు.

సినిమాటోగ్రాఫర్ రామ మారుతి ఎం అద్భుతమైన విజువల్స్ అందించారు. కాళాభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు  మరింత డెప్త్ ని జోడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యుత్తమంగా ఉన్నాయి. ఎడిటర్ కోదాటి పవన్ కల్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి, యాక్షన్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మడిగొండ అద్భుతమైన వర్క్ తో అలరించారు.  

స్ట్రాంగ్  కాన్సెప్ట్, అద్భుతమైన విజువల్స్‌తో వచ్చిన ‘మోగ్లీ 2025’ టీజర్‌ సినిమా పై అంచనాలను మరింత పెంచింది.  ఈ చిత్రం డిసెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

తారాగణం: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
యాక్షన్: నటరాజ్ మాడిగొండ
సహ రచయితలు: రామ మారుతి. ఎం & రాధాకృష్ణ రెడ్డి
PRO: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago