యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్ థ్రిల్ల‌ర్‌గా యేవ‌మ్ అంద‌ర్ని అల‌రిస్తుంది

యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్ థ్రిల్ల‌ర్‌గా యేవ‌మ్ అంద‌ర్ని అల‌రిస్తుంది: ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి బుధ‌వారం మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలివి.

మీ నేప‌థ్యం ఏమిటి?
సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా నా కెరీర్ ప్రారంభ‌మైంది. ఓ టైమ్‌లో హిందీలో ల‌గాన్‌, తెలుగులో ఖుషి సినిమాలు న‌న్ను ద‌ర్శ‌కుడిగా మార‌డానికి ప్రేర‌ణ ఇచ్చాయి. అందుకే యూఎస్‌లో రిజైన్ చేసి ఇండియాకు వ‌చ్చాను. ఆ స‌మ‌యంలో
నేను రాసుకున్న ఓ క‌థ ప్రియాంక ద‌త్ గారికి వినిపించాను. అశ్వ‌నీద‌త్ గారు కూడా క‌థ విని నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇచ్చారు. నా తొలిసినిమా వైజ‌యంతీ మూవీస్‌లో ఓంశాంతి సినిమా చేశాను. ఈ సినిమా త‌రువాత నా బిజినెస్‌ల్లో బిజీగా అవ్వ‌డం వ‌ల్ల చాలా గ్యాప్ తీసుకున్నాను. కోవిడ్ గ్యాప్‌లో మ‌ళ్లీ సినిమా చేయాల‌ని అనిపించింది. అనుకోకుండా న‌వ‌దీప్‌ను క‌ల‌వ‌డం ఆస‌మ‌యంలోనే సీస్పెస్ పెట్ట‌డం, ఆ టైమ్‌లో క‌లుసుకున్నాను. న‌వ‌దీప్‌కు కాన్సెప్టు న‌చ్చి ఈ సినిమాకు నిర్మాత‌గా మారాడు.

యేవ‌మ్ టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి?
యేవ‌మ్ అనేది సంస్కత ప‌దం, ఇతిహాసాలు, పురాణాలు చెప్పిన‌ప్పుడు ఇది ఇలా జ‌రిగింది అని చెప్ప‌డాన్నియేవ‌మ్ అంటారు. ఈ సినిమాలోని పాత్ర‌లు రియ‌ల్‌లైఫ్ పాత్ర‌ల్లా వుంటాయి. న‌లుగురు విభిన్న‌మైన వ్యక్తుల క‌థ ఇది. వంశీ అన్వేష‌ణ లాంటి థ్రిల్ల‌ర్‌ను మ‌న‌కు తెలిసిన పాత్ర‌ల‌తో చెబితే ఎలా వుంటుంది అనేది యేవ‌మ్‌.

ఎవ‌రికి తెలియ‌ని ఈ టైటిల్ పెట్ట‌డం రిస్క్ అనిపించ‌లేదా?
ఈ టైటిల్ అర్థం ఎవ‌రికి తెలియ‌నిది అని తెలుసు. కానీ క‌థ‌కు ఇదే యాప్ట్ టైటిల్‌. ఒక్క‌సారి సినిమా చూసిన త‌రువాత ఈ టైటిల్ గురించి అర్థం అవుతుంది. టైటిల్ గురించి ఇంత డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌డం కూడా మాకు ప్ల‌సే అవుతుంది.

యేవ‌మ్ పోలీసాఫీస‌ర్ క‌థ అనుకోవ‌చ్చా?
పోలీసాఫీస‌ర్ క‌థ అయినా చాలా ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్ ఇది. ప‌త్రి పాత్ర కూడా ఎంతో యూనిక్‌గా వుంటుంది. సినిమా మొత్తం సీరియ‌స్ మూడ్‌లో వుండ‌దు. ప్ర‌తి స‌న్నివేశాన్నిఆడియ‌న్స్ ఎంజాయ్ చేస్తారు.

ఈ సినిమా క‌థ‌కు మూలం ఏమిటి?
నేటి స‌మాజంలోని వ్య‌క్తుల‌ను చూసి రాసుకున్న పాత్ర‌లే ఇవి. ప్ర‌తి ఒక్క‌రికి జీవితంలో కొన్ని ల‌క్ష్యాలుంటాయి. ఆ ల‌క్ష్యాల‌ను చేదించ‌డానికి వాళ్లు ప‌డే స్ట్ర‌గుల్ ఈ క‌థ‌. అయితే చిత్రంలో ఓ అమ్మాయి త‌ను అనుకున్న గోల్‌ను ఎలా చేరుకుంది?
అనేది ఎంతో ఆస్త‌కిక‌రంగా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. స‌మాజంలోని పాత్ర‌లు, నా మైండ్‌లో రిజిస్ట‌ర్ అయిన పాత్ర‌ల్లోంచి వ‌చ్చిందే యేవ‌మ్

ఈసినిమాలోని పాత్ర‌ల గురించి?
ఈ సినిమాలో పాత్ర‌ల గురించి చెబితే క‌థ తెలిసిపోతుంది. అందుకే పూర్తిగా చెప్ప‌లేం. కానీ క్యారెక్ట‌ర్స్‌ను ఒక పోస్ట‌ర్ ద్వారా వాళ్ల పాత్ర‌ల‌ను తెలియ‌జేశాం. ఇంత‌కంటే ఎక్కువ చెబితే క్యారెక్ట‌ర్‌లోని కిక్ పోతుంది.

చాందిని చౌద‌రి పాత్ర ఎలా వుంటుంది?
చాందిని చౌద‌రి సౌమ్య పాత్ర‌లో లీన‌మైపోయింది. ప్ర‌తి స‌న్నివేశం బాగా చేసింది. ఆమెకు న‌టిగా మంచి పేరును తీసుక‌వ‌స్తుంది.

ఈ సినిమాకు నేప‌థ్యం సంగీతం ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుంది?
నేప‌థ్య సంగీతం క‌థను చెప్పాలి. క‌థ‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌దు. ఈ సినిమాకు ఫీమేల్ సంగీత ద‌ర్శ‌కురాలు నేప‌థ్య సంగీతం అందించింది. చాలా బాగా చెసింది. నేప‌థ్య సంగీతం క‌థ‌లోని ఎమోష‌న్స్ చెబుతుంది.

ఈ సినిమాను థియేట‌ర్‌లోనే ఎందుకు చూడాలి?
ఈ సినిమా మేమే థియేట‌ర్ కోసం చేసింది. టెక్నిక‌ల్‌గా కూడా థియేట్రిక‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ కోసం తీశాం. ఇది థియేట‌ర్‌లో చూడ‌ద‌గ్గ సినిమా.సినిమాను థియేట‌ర్‌లో చూసిన ఫీల్ ఓటీటీలో రాదు. థియేటిక్ర‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ బెట‌ర్ దెన్ ఓటీటీ

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago