రవితేజ గారి సినిమాకి పని చేయడంతో నా కల నేరవేరింది. ‘రావణాసుర’ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళుతుంది: హర్షవర్ధన్ రామేశ్వర్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ విలేఖరుల సమావేశంలో ‘రావణాసుర’ విశేషాలని పంచుకున్నారు.
రావణాసుర జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ?
అభిషేక్ గారి ప్రొడక్షన్ లో ‘డెవిల్’ సినిమా చేస్తున్నాను. అభిషేక్ గారు ఒక రోజు కాల్ చేసి రావణాసుర టైటిల్ ఎలా వుందని అడిగారు. చాలా పవర్ ఫుల్ టైటిల్ అని చెప్పాను. దీనికి థీమ్ సాంగ్ కావాలని కొన్ని వివరాలు చెప్పారు. ఒక ట్యూన్ చేసి పంపించాను. కొన్ని రోజులు తర్వాత ఒక రోజు స్టూడియోకి అభిషేక్ గారు, సుధీర్ వర్మ గారు వచ్చారు. రావణాసురకి నువ్వే మ్యూజిక్ చేస్తున్నావని చెప్పారు. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. వెంటనే మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో రవితేజ గారు హీరో అని చెప్పారు. నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ ని. రవితేజ గారి సినిమాకి పని చేయడం డ్రీమ్ కం ట్రూ మూమెంట్.
రావణాసురకి ఇద్దరు సంగీత దర్శకులు పని చేశారు కదా.. వర్క్ ని ఎలా డివైడ్ చేసుకున్నారు ?
నేను రావణాసురలో నాలుగు పాటలు తో పాటు నేపధ్య సంగీతం చేశాను. భీమ్స్ గారు ఒక ఐటెం సాంగ్ చేశారు.
రావణాసురకి స్పెషల్ మ్యూజిక్ వర్క్ ఉందా ?
రావణాసుర సినిమా మొత్తం స్పెషల్ గా వుంటుంది. సుధీర్ వర్మగా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సౌండింగ్ కొత్తగా వుండాలని ఎదురుచూస్తారు. రావణాసుర కి వర్క్ చేయడం ఛాలెజింగా అనిపించింది. సాంగ్స్ , నేపధ్య సంగీతం చాలా కొత్తగా చేయడం జరిగింది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు.
రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
రవితేజ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన ఇచ్చే సలహాలు సూచనలు చాలా ఇన్నోవేటివ్ గా వుంటాయి. వెయ్యినొక్క జిల్లాల వరకు రీమిక్స్ చేసినప్పుడు ఒక చోట స్ట్రింగ్ వాయిద్యం వాడను. రవితేజ గారు అక్కడ విజల్ సౌండ్ వాడితే బావుంటుందని చెప్పారు. నిజంగా అది చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా థీమ్ గ్లింప్స్ లో కూడా విజల్ వుంటుంది. అలా అది గొప్పగా కనెక్ట్ అయ్యింది.
వెయ్యినొక్క జిల్లాల పాట రీమేక్ చేయడం ఎలా అనిపించింది ?
ఇళయరాజా గారి పాటని రీమిక్స్ చేయడం ఒక సవాల్ తో కూడుకున్నది. కష్టంతో కూడుకున్న పని. రాజా గారు దీనిని మేజర్ స్కేల్ లో చేశారు. నేను రవితేజ గారి ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని మైనర్ స్కేల్ లో ఒక ట్యూన్ చేశాను. అది అందరికీ నచ్చింది. ఈపాట రీమేక్ చేయడానికి కారణం.. కథలో ఆ సందర్భం వుంది.
సుధీర్ వర్మ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
సుధీర్ వర్మ గారు సౌండ్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా వుంటారు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీగా వుంటారు. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా అడుగుతారు. దీంతో డిఫరెంట్ గా చేసే స్కోప్ దొరికింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.
రవితేజ గారు అంటే మాస్.. కానీ రావణాసుర థ్రిల్లర్.. ఈ రెండుని ఎలా బ్యాలెన్స్ చేశారు ?
రావణాసురలో ఈ రెండూ అద్భుతంగా కుదిరిరాయి. కథ బావుంటే ఆటోమేటిక్ గా మ్యూజిక్ ఫ్లో అవుతుంది. రావణాసురకి క్రియేటివిటీ ఫ్లో అయ్యింది.
అర్జున్ రెడ్డితో వచ్చిన ఫేం ని ఉపయోగించుకున్నారా ?
అర్జున్ రెడ్డి నా కెరీర్ కి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. అర్జున్ రెడ్డిని భెస్ చేసుకునే ఇప్పటికీ నన్ను సంప్రదిస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత జార్జ్ రెడ్డిలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం దక్కింది. ఈ రెండు సినిమాల తర్వాత సంగీత దర్శకుడిగా రావణాసుర నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను.
సంగీత దర్శకుడు కాకముందు ఏం చేసేవారు ?
మాది రాజమండ్రి. చెన్నై లో స్థిరపడడం. మా నాన్న గారు ప్రముఖ రిధమ్ ప్లేయర్. ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పని చేశారు. నేను రిధమ్ ప్లేయర్ గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత ప్రోగ్రామింగ్ లో పని చేశా. కన్నడ లో హరి కృష్ణ గారి దగ్గర ఏడేళ్ళు పని చేశాను. తర్వాత జిబ్రాన్, రధన్, దేవగారు ఇలా చాలా మంది దగ్గర చేశాను. అర్జున్ రెడ్డి చేసినప్పుడు పాటలతో పాటు బీజీఎం కి చేశాను. సందీప్ గారు నా పని గుర్తించి స్క్రీన్ పై పేరు వేశారు.
మీ బలం ఏమిటి ? పాటలా నేపధ్య సంగీతమా ?
రెండూ. నిజానికి నేను పాటలే ఎక్కువ కంపోజ్ చేసేవాడిని. అర్జున్ రెడ్డి తర్వాత మాత్రం అది రివర్స్ అయ్యింది.
మీ ఫేవరట్ జోనర్ ఏమిటి ?
అన్ని జోనర్స్ కి పని చేయాలని వుంటుంది. సంగీతానికి స్కోప్ వుండి, డిఫరెంట్ గా మ్యూజిక్ చేసే అవకాశం వున్న సినిమాలు చేయాలని వుంటుంది.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
కళ్యాణ్ రామ్ గారి డెవిల్, సందీప్ గారి యానిమల్ సినిమాలకి పని చేస్తున్నా.
అల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…