డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్ గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ధమ్కీ’ నాకు చాలా స్పెషల్ మూవీ. నటనతో పాటు నిర్మాణం దర్శకత్వంలో చాలా నిజాయితీగా పని చేశాను. డబ్బులు సంపాయించడానికి ఎప్పుడు సినిమా లేదు కానీ ఈ సినిమా కోసం చాలా డబ్బులు పెట్టేశాను. ఈ ప్రయాణంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి కృతజ్ఞతలు. ప్రసన్న కథ చెప్పిన్నపుడే అద్భుతమనిపించింది. డెవలప్ చేస్తూ వెళ్తుంటే దాని స్కేల్ పెరుగుతూవెళ్ళింది. నివేదా కూడా చాలా మంచి సూచన ఇచ్చింది. దాంతో సినిమా మరో లెవెల్ కి వెళ్ళింది. ఆ సూచన ఏమిటనేది విడుదల తర్వాత చెప్తాను. మహేష్, హైపర్ ఆదితో పని చేస్తుంటే కాలం సరదాగా గడిచిపోయింది. నాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో లియోన్ కి బాగా తెలుసు. ఇందులో బీజీఏం మాములుగా వుండదు. నివేద కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. ఆమెకు కథ నచ్చడంతో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. మా నాన్న నన్ను చాలా భరించారు. ఈ సినిమా ఆయనకి చాలా డబ్బులు తెచ్చిపెట్టాలి. వన్మయి క్రియేషన్స్ ఇక్కడితో ఆగిపోదు. ఇంతకుమించి సినిమాలు వస్తాయి. మా టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. దాస్ కా ధమ్కీ 22న వస్తోంది. చాలా రిస్కులు తీసుకొని చేసిన సినిమా ఇది. దీనికి కారణం సినిమాపై ప్రేక్షకులపై వున్న నమ్మకం. నేను డైరక్షన్ చేసిన ఫలక్ నామా దాస్ కి ఎంత ప్రోత్సాహం దొరికిందో డానికి రెండింత ప్రోత్సాహం ఈ చిత్రానికి దొరుకుతుంది. ‘దాస్ కా ధమ్కీ’ నా జీవితాన్ని మారుస్తుంది’’ అన్నారు
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. దాస్ కా ధమ్కీ’ నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా విశ్వక్ పూర్తి న్యాయం చేశారు. లియోన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత రాజు గారు అద్భుతమైన వ్యక్తి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. దాస్ కా ధమ్కీ’మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం యూనిట్ పడిన కష్టం ఒకెత్తు, విశ్వక్ అన్న పడిన కష్టం మరో ఎత్తు. ఇరవై రోజులుగా తిరుగుతూనే వున్నాడు. చాలా ప్రేమించి ఆయన చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం సర్వసం పెట్టి కష్టపడి పని చేశాడు. ఆయన కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా వుంటుంది. సెకండ్ హాఫ్ థ్రిల్ కోసం సినిమాకి రావాలి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్.
నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇది రెండో సినిమా. మొదటి సినిమా ఫలక్ నామా దాస్ విడుదల కాకముందే మా బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. దాస్ కా ధమ్కీ’ కోసం పదిహేను నెలలుగా కష్టపడుతున్నాడు. సినిమాకి కావాల్సిన అన్నీ సమకూర్చాడు. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నచ్చే సినిమా ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు కథ గురించి బయటికి లీక్ చేయకూడదని కోరుకుంటున్నాను. సెకండ్ హాఫ్ లో ఏమౌతుందో వేరే వాళ్ళకి చెప్పకుండా వుంటే ఈ సినిమా పెద్దస్థాయిలో వుంటుంది’’ అన్నారు
లియోన్ జేమ్స్ మాట్లాడుతూ.. విశ్వక్ తో ఇది నా మూడో సినిమా. దాస్ కా ధమ్కీ కోసం చాలా కొత్తగా సౌండ్ డిజైన్ చేశాం. నేపధ్య సంగీతంలో చాలా డిఫరెంట్ సౌండ్ వినిపిస్తాయి. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇస్తాయి. సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా గొప్పగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. మహేష్ , హైపర్ ఆది, అన్వర్ అలీ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ‘దాస్ కా ధమ్కీ’ టీం సమాధానలు ఇచ్చింది :
మీతో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు దర్శకులు వుంటారు కదా.. మీరే చేయడానికి కారణం ఏమిటి ?
విశ్వక్ : ఈ కథని నేను ఏ స్థాయిలో అనుకున్నానో అలా తీయాలంటే వేరే నిర్మాత అయితే ఇబ్బంది పడే అవకాశం వుందనిపించింది.అందుకే నేను నిర్మాతగా మారాల్సివచ్చింది. పరిశ్రమలో నాకూ మంచి నిర్మాణ సంస్థ స్థాపించలాని వుంది. మంచి సినిమాలు తీయాలి. ‘డబ్బులు సంపాయించడం కోసం సినిమాలు చేయడం లేదు. సినిమాలు చేయడానికి డబ్బులు సంపాయిస్తున్నా’ అనేది నా నినాదం.
ఎన్టీఆర్ గారు మిమ్మల్ని డైరెక్షన్ వదిలేమని చెప్పారు కదా ? దాని గురించి
వదిలేస్తా. కానీ అప్పుడప్పుడు పట్టుకుంటా. (నవ్వుతూ) ఏదైనా కథ ప్రేక్షకులకు ఖచ్చితంగా చెప్పాలనుకున్నప్పుడు డైరెక్షన్ చేస్తా.
ఒక నటనతో పాటు డైరెక్షన్ చేయడంలో వున్న సౌలభ్య త ఏమిటి ? యాక్టర్ డైరెక్టర్ డామినేషన్ ఏమైనా ఉంటుందా ?
నేను యాక్టింగ్ చేసినప్పుడు కూడా సినిమా అంతా నామీదే నడవాలనుకునే మనిషిని కాదు. కథలో అందరికీ అన్ని పాత్రలకు ప్రాధన్యత వుంటుంది. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మీటర్ లో తీశా. సెకండ్ హాఫ్ లో చాలా థిన్ లైన్ వుంటుంది దాని గురించి రిలీజ్ తర్వాత మీరు మాట్లాడతారు. సెకండ్ హాఫ్ విశ్వక్ సేన్ మాత్రమే తీయగలిగే సినిమా అని నమ్మకంగా చెప్పుకోగలను. విశ్వక్ సేన్ డైరెక్షన్ వలన ప్లస్ ఏమిటంటే.. సెకండ్ హాఫ్.
మీ ఈవెంట్స్ కి బాలకృష్ణ గారు లాంటి పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి బ్లెస్ చేయడం ఎలా అనిపిస్తుంది ?
దీనిని ఒక బ్లెసింగ్ గా భావిస్తాను. బాలకృష్ణ గారు , ఎన్టీఆర్, రామ్ చరణ్..ఇలా అందరూ ఎంతో సపోర్టివ్ గా వుండటం నిజంగా బ్లెసింగ్.
డబుల్ రోల్ అంటే చాలా సినిమాలు వచ్చాయి.. ఇది ఎలా కొత్తగా వుండబోతుంది.
ఒక్క సినిమాలో రెండు సినిమాలు చూసే ఎఫెక్ట్ వుంటుంది. ఇంటర్వెల్ నుంచి కథ మరో లెవెల్ వుంటుంది. ముగింపు చాలా బరువుతో వస్తారు. పాత్రలు మీకు గుర్తుండిపోతాయి.
ఈ సినిమాలో మీరు సంపాయించింది మొత్తం పెట్టేశారని విన్నాం.. అంత నమ్మకం కలిగించిన అంశం ఏమిటి ?
ఇలా చేయడం ఇది రెండో సారి ఫలక్ నామా దాస్ కి కూడా మొత్తం పెట్టేశాను. అప్పుడు అది ఎంత పెద్దదో ఇప్పుడు ఇది అంత పెద్దది. సేఫ్ జర్నీ చేయోచ్చు, కానీ చేతిలో కథ వుంది. బాగా తీయగలననే నమ్మక వుంది. ఆ నమ్మకంతోనే నిజాయితీగా చేశాను.
రాజు గారు.. మీ అబ్బాయి మీతో చాలా ఎక్కువ ఖర్చు పెట్టించారట ? బాగా విసిగించారట ?
క్యాలిటీ లేకపోతే నేనూ రాజీపడను. బెస్ట్ క్యాలిటీ తీసుకోస్తాడనే నమ్మకం వుంది. అది నిజమైయింది. సినిమా మూడింతలు బడ్జెట్ పెరిగింది. తను ఏది అనుకున్నారో అది తీశాడు.
నివేదా గారు.. ఈ సినిమాలో విశ్వక్ ఎదుర్కున్న టఫ్ మూమెంట్ ఏమిటి ?
ఇందులో తొమ్మిది నిమిషాల సింగిల్ షాట్ వుంది. మొత్తం 18 టేకులు తీసుకున్నాం. టఫ్ గా అనిపించిన ఎక్కడా రాజీపడకుండా ఆ షాట్ ని తీశారు విశ్వక్.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…