‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం.. థియేటర్‌కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత నిహారిక కొణిదెల

‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం.. థియేటర్‌కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత నిహారిక కొణిదెల

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ను ఆడియెన్స్ ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ‘రాకాస’ చెప్పిన కథ నాకు వెంటనే నచ్చేసింది. మనందరినీ గతంలోకి తీసుకెళ్లేలా ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీని నిర్మించాను. సినిమా ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నదే నా పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ లక్ష్యం. ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. థియేటర్‌కు వచ్చిన వాళ్లని మాత్రం నిరాశపర్చం. ఈ చిత్రంతో సంగీత్ మరింత షైన్ అవుతాడు. నేను ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లాలని సినిమాలు తీయలేదు. ప్యాషన్‌తో, ప్రేమతో సినిమాల్ని తీస్తున్నాను. అలా ‘కమిటీ కుర్రోళ్లు’ అవార్డుల్ని అందుకుంది. ‘రాకాస’ కూడా అంతే ప్రేమతో, ప్యాషన్‌తో నిర్మించాను. ఎక్కడికి వరకు వెళ్తుందో చూడాలి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ని నేను మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరితో, అన్ని రకాల జానర్ల సినిమాల్ని తీస్తాను.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘‘నిహారిక, మానస గారి వల్లే ‘రాకాస’ ఈ స్థాయికి వచ్చింది. ఆ ఇద్దరి వల్లే నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఈ మూవీ కోసం ఆ ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. మానస గారు కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. నిర్మాతగా నిహారిక గారు అని చెప్పడంతో మరింత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ‘రాకాస’ అందరినీ నవ్విస్తుంది. ఇందులో నాది వన్ మెన్ షో ఉంటుందో లేదో కానీ.. మానస శర్మ గారిది మాత్రం వన్ ఉమెన్ షో లా ఉంటుంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రేక్షకులు పెట్టే టికెట్ డబ్బులకి న్యాయం చేసేలా ‘రాకాస’ ఉంటుంది’ అని అన్నారు.

దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ కోసం మేమంతా చాలా కష్టపడి పని చేశాం. నిహారిక వల్లే నేను దర్శకురాలిగా మారాను. నేను ఆమెకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. సంగీత్ శోభన్‌ వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి. సంగీత్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్లందరికీ కూడా డ్రీమ్ యాక్టర్‌గా సంగీత్ నిలుస్తాడు. ఈ కథను నేను మహేష్ ఉప్పల గారితో కలిసి రాశాను. ఏప్రిల్ 3న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

జీ తెలుగు హెడ్ దివ్య మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్‌తో కలిసి ‘రాకాస’ని చేయడం ఆనందంగా ఉంది. నిహారికతో కలిసి పని చేయడం మాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ‘రాకాస’ క్వాలిటీని అందరూ చూస్తున్నారు. ‘రాకాస’ రిలీజ్ కోసం నేను కూడా ఎంతో ఎదురుచూస్తున్నాను. ఏప్రిల్ 3న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.

సంగీత దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ ..‘‘రాకాస’ సినిమాలో మూడు పాటలుంటాయి. మూవీ రిలీజ్ తరువాత మరో పాటను విడుదల చేస్తాం. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ఏప్రిల్ 3న ‘రాకాస’ మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ .. ‘నిహారిక గారితో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చేశాను. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు‘రాకాస’ చేస్తున్నాను. మానస శర్మ గారు మళ్లీ నాకు ఓ మంచి పాత్రను రాశారు. అనుదీప్ గారు మంచి సంగీతాన్ని అందించారు. సంగీత్ శోభన్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

నటి రోహిణి మాట్లాడుతూ .. ‘‘రాకాస’ చిత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఫ్యామిలీతో కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది. ఇందులో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

న‌టీన‌టులు: సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్స్: జీ స్టూడియోస్‌, పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌ l నిర్మాత‌లు: నిహారిక కొణిదెల‌, ఉమేష్‌కుమార్ బన్సాల్‌ l క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం: మాన‌స శ‌ర్మ‌ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: మ‌న్యం ర‌మేష్‌ l ఆడిష‌న్ స్క్రీన్ ప్లే: మ‌హేష్ ఉప్పాల‌ l సంగీతం: అనుదీప్ దేవ్‌ l సినిమాటోగ్రాఫ‌ర్‌: రాజు ఎదురోలు l యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌: విజ‌య్‌ l ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ l ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రామాంజ‌నేయులు l ఆర్ట్ డైరెక్ట‌ర్‌: పుల్ల విష్ణు వ‌ర్ధ‌న్‌ l కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: సంధ్య సబ్బ‌వ‌ర‌పు l పి.ఆర్.ఒ: ఎస్‌.కె.నాయుడు-ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌న‌ర్‌: యు వి మీడియా l మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

8 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago