దసరా’ నుంచి గూస్ బంప్స్ గ్లింప్స్

ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న నేచురల్ స్టార్ నానికి అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మేకర్స్ మాస్ అప్పీలింగ్ పోస్టర్‌ తో పాటు గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని కళ్ళజోడు ధరించి బీడీ తాగుతూ ఊర మాస్‌గా ఆకట్టుకున్నారు. ధరణిని ఘనంగా స్వాగతిస్తున్న డప్పు దరువులు కూడా పోస్టర్‌లో అలరిస్తున్నాయి.

గ్లింప్స్ వీడియోలో ధరణిగా నాని ఆడిన ఊర మాస్‌ క్రికెట్ మెస్మరైజ్ చేసింది. లుంగీ కట్టుకొని బీడీ తాగుతూ క్రీజ్ లో బ్యాట్ పట్టుకొని బాల్ కోసం ఎదురుచూసిన ధరణి.. బాల్ ని సిక్సర్ గా మలిచి.. బ్యాట్ ని గాల్లో విసిరేసి.. నడుచుకుంటూరావడం.. గూస్  బంప్స్ తెప్పించింది. ఈ గ్లింప్స్ కు సంతోష్ నారాయణ్ సమకూర్చిన నేపధ్య సంగీతం మాస్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.  

అలాగే నాని బర్త్ డే సందర్భంగా ‘దసరా’ కు తెలుగు రాష్ట్రాల్లోని 39 కేంద్రాల్లో కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్ సినిమాల్లోనే మొట్టమొదటి మాసీవ్ ఫీట్. సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై, విడుదల తేదీ వరకు ప్రతి రోజు థియేటర్లలో కటౌట్‌లను మారుస్తారు. తరువాత, కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాల్లో ఏర్పాటు చేస్తారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌కి అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మేకర్స్ డబుల్ ఎనర్జీతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.  ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘దసరా’ దేశంలోనే భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటి. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago