క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వింటర్’. రామ్, ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ, శ్రీజిత ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని రియాజ్ అహ్మద్, టి. శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ‘రాచరికం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సురేష్ లంకలపల్లి ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాతో రిజ్వాన్ అలీ విలన్‌గా తెరకు పరిచయం కానున్నారు. ఇక ఈ మూవీని కశ్మీర్ లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
‘వింటర్’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్ని ఇటీవలె ఘనంగా నిర్వహించారు. చిత్ర ప్రారంభోత్సవంలో టీం అంతా పాల్గొంది. సినిమా అద్భుతంగా రావాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని కోరుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, ఇతర టెక్నికల్ టీంకు సంబంధించిన వివరాల్ని ప్రకటించనున్నారు.
నటీనటులు : రామ్, ఆదిత్య సూరజ్ సింగ్ , కుసుమ చందక, శశికళ, శ్రీజిత గోష్, రిజ్వాన్ అలీ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్స్ : క్రిసెంట్ సినిమాస్, TSR మేకర్స్
నిర్మాతలు: రియాజ్ అహ్మద్, టి. శ్రీనివాస్ రావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ లంకలపల్లి
పీఆర్వో : సాయి సతీష్
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…