‘స్లమ్ డాగ్ హజ్బెండ్’పై నటుడు బ్రహ్మాజి

Must Read

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మాజి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త కారెక్టర్ దొరికింది. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ కారెక్టర్. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను.

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్‌కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం.

సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మొన్న ఓ సారి పుష్ప పార్ట్ 2 షూటింగ్‌లో ఉన్నాను. రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఆ ట్రైలర్‌ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు. టీం అందరికీ చెప్పి చూపించాడు.

ఇంట్లో సినిమాల గురించి తక్కువగా మాట్లాడుతుంటాం. కానీ సినిమాల గురించి నేనేమీ సలహాలు ఇవ్వను. అందరిలా సినిమాలు చేస్తే ఏముంటుంది.. కొత్తగా ప్రయత్నించు అని మాత్రం చెబుతుంటాను. డిఫరెంట్ కాన్సెప్ట్‌లు ఎంచుకోమని చెబుతాను. అదే బెటర్ ఆప్షన్.

సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్‌గా నిలుస్తుంది.

జూలై 21న విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఆ టైంలో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాం. జూలై 28న బ్రో రిలీజ్ అవుతోంది. బ్రో సినిమాకు టికెట్లు దొరక్కపోతే మా సినిమాకే వస్తారు (నవ్వుతూ).

స్లమ్ డాగ్ హజ్బెండ్ స్టోరీని ఆర్జీవీ గారికి వినిపిస్తే.. కుక్క మొగుడు అని టైటిల్ పెట్టమని అన్నారట. కానీ నిర్మాతలు మాత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ అని పెడితేనే బాగుంటుందని అన్నారు.

అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్. ఆయన తన పీక మీద కత్తి పెట్టించుకుని సినిమాలు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన స్క్రిప్ట్ రాసి అలా చేద్దాం, ఇలా చేద్దామని ఇచ్చారు. నిజంగా ఆయన గ్రేట్. ప్రతీ చోట అందరూ నాకు సాయం చేస్తూనే వచ్చారు. ప్రదీప్, అలీ, నాగార్జున ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించుకోవడమే నా ఆస్తిగా ఫీలవుతాను.

సుకుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తాను అని అన్నారు. కానీ అర్జెంట్‌గా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. రాలేకపోతోన్నాను.. వీడియో బైట్ పంపిస్తాను అని మెసెజ్ పెట్టారు. ఆయన ఇక్కడ ఉండుంటే.. కచ్చితంగా వచ్చేవారు.

సోషల్ మీడియాను ఎంతో సరదాగా తీసుకుంటాను. నేను సీరియస్‌గా తీసుకోను. నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని ప్రయత్నిస్తాను.

కుళ్లుతో ఉంటే యంగ్‌గా కనిపించం. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే యంగ్‌గా కనిపిస్తాం. అయినా ఇప్పుడు ఎనభై ఏళ్లు దాటితేనే మాట్లాడుకోవాలి. అంత వరకు అందరూ యంగ్ అన్నట్టే. (నవ్వులు)

భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. మా సినిమాకు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. మ్యూజికల్ హిట్ అవుతుంది.

పుష్ప మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ అదిరిపోతుంది. దాని బాబులా ఈ సినిమా ఉంటుంది. ఫాహద్ ఫాజిల్ పక్కనే కనిపిస్తాను. ఆయన కూడా ఈ మూవీ ట్రైలర్ చూశారు. మెచ్చుకున్నారు. వేరే భాషల్లోనూ ఈ కాన్సెప్ట్‌ను చేయొచ్చు అని అన్నారు.

మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్, బాలయ్య గారి భగవంత్ కేసరి, ఊరి పేరు భైరవకోన, నాగ శౌర్యతో ఓ సినిమా. ఇలా చాలానే ఉన్నాయి. ప్రభాస్ సలార్ సినిమాలో కొత్త కారెక్టర్ వేస్తున్నాను. రెండో పార్ట్‌లోనే ఎక్కువగా కనిపిస్తాను.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News