‘వాట్ ది ఫిష్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల

మనోజ్ మంచు, 6ix సినిమాస్, వరుణ్ కోరుకొండ ‘వాట్ ది ఫిష్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కమ్ బ్యాక్ మూవీని ఇదివరకే ప్రత్యేకంగా అనౌన్స్ చేశారు. ‘వాట్ ది ఫిష్’ అనే ప్రాజెక్ట్‌కి  నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంతో పాటు కథ , స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘మనం మనం బరంపురం’ అనేది సినిమా ట్యాగ్ లైన్.

‘వాట్ ది ఫిష్’ హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. పాన్-ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్‌  విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ  నిర్మిస్తున్నారు.

రాకింగ్ స్టార్ మనోజ్ మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, టీమ్ ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ తో ముందుకు వచ్చింది. ఇందులో మనోజ్ ని విభిన్న గెటప్‌లలో చూడవచ్చు. “ఐయామ్ ఏ  బ్యాడ్ చైల్డ్.. ఐయామ్ కమింగ్ ఫర్ యూ.. ఫైండ్ ఎ ప్లేస్ టు హైడ్.. ఐయామ్ ఎ బ్యాడ్ చైల్డ్.. ది వార్ హ్యాజ్ బిగెన్.. ఫైండ్ ఎ ప్లేస్ టు రన్’’ అని మనోజ్ చెప్పడం క్యూరియాసిటీని పెంచుతోంది.  

అటామిక్ క్రేజ్, రా, గ్రిట్, స్వాగే, గన్స్ బ్లేజింగ్ అనే పదాలు సినిమా థీమ్‌ను తెలిజేస్తున్నాయి. ‘వాట్ ది ఫిష్’ ఒక యూనిక్  కాన్సెప్ట్‌తో కూడిన ప్రత్యేకమైన సినిమా అని గ్లింప్స్  ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో అందించిన కంటెంట్ లాగా చాలా క్రేజీగా ఉంది.

ఈ సినిమా అడ్వెంచర్ షూటింగ్ బ్యూటీఫుల్ టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో 75 రోజుల పాటు జరగనుంది, ఈ చిత్రం లో పని చేస్తున్న ప్రతిభావంతులైన తెలుగు నటీనటులు, ప్రపంచ ప్రఖ్యాత నటీనటులు, టెక్నికల్ టీం వివరాలని త్వరలో తెలియజేస్తారు మేకర్స్.

వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: మనోజ్ మంచు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వరుణ్ కోరుకొండ
నిర్మాతలు: విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ
బ్యానర్: 6ix సినిమాస్ & afilmbyv
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సహ నిర్మాత: వరుణ్ కోరుకొండ

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

3 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago