టాలీవుడ్

‘మై డియర్ దొంగ లాంటి కాన్సెప్ట్ సినిమాలే చేస్తాం: మహేశ్వర్ రెడ్డి

సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా మాట్లాడుతూ..‘‘అభినవ్‌తో స్టార్ చేస్తే.. 2014లో మేము తీసిన ఫస్ట్ మూవీ ‘జగన్నాటకం’లో కూడా అభినవ్ దొంగ క్యారెక్టర్ చేశాడు. మళ్లీ ఇప్పుడు పదేళ్ల తర్వాత దొంగ పాత్ర చేశాడు. ఇందులో కామెడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ర్యాడికల్ కామెడీ ఉంది. మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశా. ఆహా గురించి చెప్పక్కర్లేదు. ఆహా నుంచి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

నిర్మాత మహేశ్వర్‌‌రెడ్డి మాట్లాడుతూ..‘‘మై డియర్ దొంగ అంటే ఈ టీమ్‌లో శాలిని. ఆమె ఒక స్టోరీ రాసి, అందులో నటించడం అంటే చాలా గొప్ప విషయం. ఆమె ఒక డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ఇంత సక్సెస్ చేయడంలో ఆమే కీలకం. తర్వాత ఆహా ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించింది. ఎంతోమంది కొత్త టాలెంట్‌ను గుర్తించి వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడమ్‌ను ఇచ్చింది ఆహా. చాలా తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైమ్‌లో మంచి అవుట్‌పుట్ ఇచ్చిన డైరెక్టర్ సర్వాంగ రియల్లీ గ్రేట్. మ్యూజిక్ ఈ సినిమాకు గ్రేట్ ఎసెట్. శాలిని, అభినవ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. క్యామ్(CAM) ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ముగ్గురు వ్యక్తులు. వాళ్లు చంద్ర, అభిలాష్, మహేశ్. కొత్తవాళ్లతో మేము ఫ్రెండ్లీగా సినిమాలు చేయాలనుకుంటున్నాము. మంచి స్టోరీస్ ఉన్నవాళ్లు మమ్మల్ని సంప్రదించండి’’ అని చెప్పారు.

నటుడు నిఖిల్ మాట్లాడుతూ..‘‘ఇది నా ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్. అభినవ్ అన్న నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సిద్ధు, అడివి శేష్ లాగా శాలినీ తనే కథ రాసి యాక్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఇందులో యాక్ట్ చేసిన వాళ్లలో ఒక్కరి నుంచి ఒక్కో విషయం నేర్చుకున్నా. నాలాంటి కొత్త నటుడి నమ్మినందుకు ఆహాకు థ్యాంక్స్. ’’ అని అన్నారు.

నటి స్నేహల్ మాట్లాడుతూ..‘‘డైరెక్టర్ కష్టం అంతా ట్రైలర్‌లో కనిపిస్తోంది. శాలినీ రైటింగ్ చాలా బాగుంది. దివ్య శ్రీపాదతో కలిసి నటించడం నా అదృష్టం. ఏప్రిల్ 19న ‘మై డియర్ దొంగ’ను ఆహాలో చూసి ఆనందించండి’’ అని చెప్పారు.

నటి దివ్య శ్రీపాద మాట్లాడుతూ..‘‘నేను ఇందులో బుజ్జి అనే క్యారెక్టర్ చేశాను. నాకు శాలినీ చేసే స్కెచెస్ లాంటివి చాలా నచ్చుతాయి. ఇప్పుడు ఆమె రాసిన సినిమాలో నేను చేశా. ఇదొక నేచురల్ స్టోరీ. నేచురల్ స్టోరీ అంటే అందరూ విలేజ్ బ్యాక్‌డ్రాప్ అనుకుంటారు. కానీ ఇది సిటీలో జరిగే స్టోరీ. అమ్మాయి కష్టాలపై జోక్స్ వేసుకుని నవ్వించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో నాక్యారెక్టర్ నా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. టైమ్ తెలీకుండా సినిమా మొత్తం చూసేస్తారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

నటుడు శశాంక్ మాట్లాడుతూ.. ‘‘మా టీమ్ గురించి మాట్లాడాలంటే శాలినీ గురించి చెప్పాలి. ఫస్ట్ ఆడిషన్‌లోనే నన్ను సెలెక్ట్ చేసింది. కొన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి సినిమాను పూర్తి చేసింది. అభినవ్ అన్న నుంచి చాలా నేర్చుకున్నా. టీమ్ అంతా ఎంతో ఎనర్జిటిక్‌గా పని చేశాం. ఈ సినిమాను 19న ఆహాలో అందరూ తప్పకుండా చూడండి.’’ అని అన్నారు.

హీరోయిన్, రైటర్ శాలినీ మాట్లాడుతూ..‘‘ముందుగా ఆహాకు థ్యాంక్స్ చెప్పాలి. నా స్క్రిప్ట్‌ను, నా యాక్టింగ్‌ను ఆహా టీమ్ ఎంతగానో నమ్మారు. నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్లే. ఈ మధ్య చాలామంది యాక్టర్స్ రైటింగ్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్నప్పుడు వంశీని తీసుకున్నా. నేను ఏదైనా జోక్ చెప్తే వంశీ ఇంప్రువైజ్ చేశాడు. ట్రైలర్‌లో ఉన్న ఒక డైలాగ్‌ను కూడా వంశీ ఇంప్రూ చేశాడు. నేను, ప్రియదర్శి, అభినవ్ గోమటం ముగ్గురూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌కు థ్యాంక్స్ చెప్పకూడదని అంటారు. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ వస్తుందో అని భయపడ్డా. కానీ ఇప్పుడే సక్సెస్ వైబ్స్ వస్తున్నాయి. ఫస్ట్ దీన్ని ఒక వెబ్ సిరీస్‌గా చేద్దామనుకున్నాం. కానీ ఇది ఫిల్మ్‌కు కూడా వర్కవుట్ అవుతుందని భావించి సినిమాగా చేశాం. మ్యూజిక్ డైరెక్టర్ బీజీఎంతో మేజిక్ క్రియేట్ చేశారు. టీమ్ అందరికీ గుడ్ లక్’’ అని చెప్పారు.

నటుడు వంశీ మాట్లాడుతూ..‘‘ఈ ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి శాలినీని చూస్తున్నా. ఫస్ట్ సినిమాకే శాలినీ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు యాక్టింగ్ కూడా చేసింది. ఆమె జర్నీ రియల్లీ గ్రేట్’’ అని చెప్పారు.

ఆహా కంటెంట్ హెడ్ వాసు మాట్లాడుతూ..‘‘ఏళ్ల తరబడి ఆహాను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్యూ. లాస్ట్ టైమ్ అర్థమైందా అరుణ్ కుమార్‌కు ప్రియదర్శి గెస్ట్‌గా వచ్చాడు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా దర్శి గెస్ట్‌గా వచ్చాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది. మై డియర్ దొంగ సినిమాకు శాలినీ గ్రేట్ ఎఫర్ట్ పెట్టింది. నిర్మాత మహేశ్ పని రాక్షసుడు. డైరెక్టర్ సర్వాంగ పని తీరు చాలా బాగుంది. ఇలాగే కష్టపడితే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తాడు. ప్రతిఒక్కరూ ఈ ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌గా ట్రీట్ చేస్తున్నారు. అభినవ్ క్రేజీనెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. దొంగగా ఎవరు చేస్తే బాగుంటుందని శాలినీ, నేను అనుకున్నప్పుడు అభినవ్ పేరే వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతోమంది తెరవెనుక గ్రేట్ వర్క్ చేశారు. వాళ్లందరికీ థ్యాంక్యూ. ఏప్రిల్ 19న మైడియర్ దొంగను ఆహాలో చూడండి’’ అని చెప్పారు.

హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచీ దీనికోసం పని చేస్తున్నవాళ్లను నేను కలుస్తున్నా. ఆహా కంటెంట్ హెడ్ వాసు ప్రతి ఒక్కరికీ సపోర్ట్ చేస్తుంటాడు. ఆహా టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఫస్ట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వాళ్లదగ్గర నుంచే వచ్చింది. ఈ కంటెంట్ మొత్తం నేను చూశాను. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. శాలినీ, నేను పదేళ్ల నుంచి ఫ్రెండ్స్. ప్రియదర్శి నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు శాలినీ స్క్రీప్ట్‌లో యాక్ట్ చేశా. ఆమె చాలా సెన్సిబుల్. ఆమె ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. ఒక మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.’’ అని చెప్పారు.

చీఫ్ గెస్ట్ ప్రియదర్శి మాట్లాడుతూ..‘‘శాలినీ, అభినవ్ నా ఫ్రెండ్స్. వాళ్లని సపోర్ట్ చేద్దామని నేను వచ్చాను. మేమంతా ఎక్కడో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటే ఉండేవాళ్లం. ఇక్కడ సినిమా స్క్రీనింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. కానీ ఇప్పుడు ఈ స్టేజీ మీద ఉండడం చాలా బాగుంది. యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నా అవకాశాలు రాకపోవడంతో తన స్క్రిప్ట్ తనే రాసుకుని మీ ముందుకు వస్తోంది శాలినీ. యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయన్నట్లు శాలినీని వెతుక్కుంటూ ఆహా వచ్చింది. మిమ్మల్ని మీరు నమ్మితే అనుకున్నది సాధిస్తారు. అందుకు శాలినీయే ఉదాహరణ. ఈ సినిమా ఆమె కోసం సక్సెస్ అవ్వాలి. మంచి సినిమాలకు ఆహా సపోర్ట్ చేయడం నిజంగా మంచి విషయం. టాలెంట్ ఉన్నవాళ్లకు ఆహా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.

నటీనటులు: అభినవ్ గోమటం, శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి, చంద్ర వెంపతీ తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్: క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్
ప్రొడ్యూసర్: మహేశ్వర్‌రెడ్డి గోజల
డైరెక్టర్: బీఎస్ సర్వాంగ కుమార్
రైటర్: శాలిని కొండెపూడి
డీవోపీ: ఎస్ఎస్ మనోజ్
మ్యూజిక్ డైరెక్టర్: అజయ్ అర్సాడా
ఎడిటర్: సాయి మురళి
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ లింగం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికిరణ్ మదినేని, వెంకటేష్. వై
క్యాస్టూమ్ డిజైనర్: అనూష దేవర

Tfja Team

Recent Posts

Rahasyam Idam Jagat A Unique Story Komal R Bharadwaj

Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional…

23 mins ago

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయిని కథ రహస్య ఇదం జగత్‌ దర్శకుడు కోమల్‌

మీ నేపథ్యం ఏమిటి:నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్‌. అమ్మ…

23 mins ago

Erra Cheera Movie Glimpse Release Event Movie Release On Dec 20

The film "Erra Cheera - The Beginning" is jointly produced by Sri Padmayal Entertainment and…

1 hour ago

ఎర్రచీర సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్. డిసెంబర్ 20న మూవీ విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర -…

1 hour ago

షాపింగ్ మాల్ సినిమాకు 14 ఏళ్లు.

తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…

1 hour ago

The movie Shopping Mall has completed 14 years..

Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…

1 hour ago