వరుణ్ తేజ్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ తెలుగు-హిందీ యాక్షన్ డ్రామా #VT13 యాక్షన్ షెడ్యూల్ పూర్తి, డిసెంబర్‌లో థియేట్రికల్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ #VT13 టీమ్ గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ రివిల్ చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న IAF అధికారిగా కనిపించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ కలిసి రూపొందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా టైటిల్‌ను త్వరలో అనౌన్స్ చేస్తారు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ ఈ చిత్రంలో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో శరవేగంతో జరుగుతోంది. ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ డాషింగ్ గా కనిపిస్తున్న కొన్ని స్టిల్స్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…