న‌వంబ‌ర్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్ లాల్ ‘వృష‌భ‌’

మలయాళ సూపర్‌స్టార్‌..కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది. అన్ని భాష‌ల ఆడియెన్స్ మోహ‌న్‌లాల్‌ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయ‌న ప్ర‌స్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ ‘వృష‌భ‌’లో హీరోగా న‌టిస్తున్నారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు.

హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా రూపొందుతోన్న ‘వృష‌భ‌’ సినిమాకు నంద కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ మూవీని న‌వంబ‌ర్ 6న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..

నిర్మాత ఏక్తా క‌పూర్ మాట్లాడుతూ ‘‘ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీగా రూపొందిస్తోన్న ‘వృష‌భ‌’ సినిమాను నవంబర్ 6న విడుదల చేస్తున్నామని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. ఇది నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన క‌థ‌. బ‌లమైన భావోద్వేగాలు, లార్జ‌ర్ దేన్ లైఫ్ డ్రామాతో ఇండియ‌న్ సినిమాను గొప్ప‌గా ఆవిష్క‌రిస్తున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు నంద కిషోర్ మాట్లాడుతూ ‘‘నవంబర్ 6న ‘వృష‌భ‌’ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని తెలియ‌జేయ‌టానికి ఎంతో ఆనందంగా ఉంది. వృష‌భ సినిమాతో ఓ చ‌రిత్ర‌ను క్రియేట్ చేయ‌బోతున్నాం. బ‌ల‌మైన భావోద్వేగాల‌తో పాటు అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో సినిమాను రూపొందించాం. బంధాలు, త్యాగాల క‌ల‌యిక‌గా రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌కు గొప్ప‌గా క‌నెక్ట్ అవుతుంది. ఇదొక ప్ర‌త్యేక‌మైన‌, సంక్లిష్ట‌మైన క‌థ‌. దీనికి ప్రాణం పోయ‌టానికి ఎంటైర్ టీమ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. న‌వంబ‌ర్ 6న సినిమాను చూసే ప్రేక్ష‌కులు ఓ గొప్ప అనుభూతికి లోన‌వుతారు’’ అన్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే మోహ‌న్‌లాల్ అందులో యోధుడైన రాజు పాత్ర‌లో క‌నిపిస్తారు. విధి పిలిస్తే ..ర‌క్త‌మేస్పందించాలనే బ‌ల‌మైన సందేశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా అందించారు. రీ బ‌ర్న్ ల‌వ్‌.. ఎ ల‌వ్ సో స్ట్రాంగ్‌, ఇట్ డిఫైస్ డెత్ అనే ఎమోష‌న‌ల్ ట్యాగ్ లైన్ ప్రేమ గొప్పతనం, అశాంతి, శాశ్వతమైన బంధాలపట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. భూత కాలానికి, వ‌ర్త‌మాన కాలాన్ని చూపించిన టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ఆస‌క్తి పెరిగింది.

మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో స‌మ‌ర్జిత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న సారిక త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ర‌సూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేశారు. ఎస్‌.ఆర్‌.కె, జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి, కార్తీక డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, నిఖిల్ యాక్ష‌న్ కొరియోగ్ర‌పీ చేశారు.

యాక్ష‌న్‌, డ్రామా, అద్భుత‌మైన విజువ‌ల్స్ క‌ల‌యిక‌గా ఉన్న క‌థ‌ను ఎపిక్ యాక్ష‌న్ సినిమాటిక్ జ‌ర్నీగా రూపొందించారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. మలయాళం, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, కన్నడ భాషలలో కూడా క‌లిపి ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 6న రిలీజ్ అవుతుంది.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago