యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు రత్నం రాబోతోంది. ఇది వరకే ఈ ఇద్దరి కాంబోలో భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సారి రత్నంతో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. రత్నం సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 26న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఎటువైపో ఎటువైపో.. అనే పాట శ్రోతలను మెప్పించింది. దేవీ శ్రీ ప్రసాద్ విశాల్ కాంబోలో రత్నం మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి రత్నం మీద పడంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
సినిమా రేపే (ఏప్రిల్ 26) విడుదల కానుంది. ఈ మేరకు సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించి యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కొనియాడారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…