విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే – ఇతరులు వచ్చి ఇబ్బంది పడదొద్దు

Must Read

ఇండియా లోనే క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్ గా విరోష్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పెళ్లి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈ నెల 4న సాయంత్రం విజయ్ దేవరకొండ, రశ్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు ఈ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది.

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News