వైవాహిక జీవితంలోకి తాము అడుగుపెట్టిన సందర్భంగా మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించిన దేశ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట. వారిపై తమ ప్రేమను చూపించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేస్తున్నట్లు విరోష్ ప్రకటించారు. ఈ రోజు తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బిహార్ లోని పలు నగరాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేయనున్నారు.
ఈ ప్రకటనలో విరోష్ స్పందిస్తూ – మా జీవిత ప్రయాణంలో ఈ దేశ ప్రజలందరూ ఒక భాగమే. మా వివాహం సందర్భంగా మీరంతా చూపించిన ప్రేమకు, అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు. ఈ సంతోషమైన సందర్భాన్ని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మీ అందరికీ స్వీట్స్ పంపిస్తున్నాము. వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలి. అని అన్నారు.
నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు…
మాస్టర్ కనిష్క్ మహాబలాహ్ సమర్పణలో శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఓ…
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'హే బల్‌వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…