మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను బ్లాక్ బస్టర్ బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయి రాజేష్ గారు మాట్లాడుతూ “ఇప్పుడే విరాజి టీజర్ చూసాను, చాలా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయింది. క్యారెక్టర్ కోసం అంత అంకిత భావంతో పని చేస్తున్న వరుణ్ సందేశ్ కి కంగ్రాట్స్. ప్రమోషన్ లో కూడా తన క్యారెక్టర్ గెట్ అప్ లో పర్మనెంట్ హెయిర్ కలర్ లో ఉండటం చాలా అరుదు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. అలాగే దర్శకుడు ఆద్యంత్ హర్ష మా నెల్లూరు వాడు కావడం చాలా సంతోషం. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల అవుతుంది, నిర్మాత మహేంద్ర గారికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అని తెలిపారు
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “ఈరోజు మా విరాజి చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను బేబీ దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. సినిమా చాలా బాగా వచ్చింది, ఆగస్టు 2న విడుదల అవుతుంది.
దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ “విరాజి నా మొదటి సినిమా. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను సాయి రాజేష్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. వరుణ్ సందేశ్ గారి లుక్ కి కథ కి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఆగస్టు 2న సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది” అని తెలిపారు
నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ “విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ గారు విడుదల చేయడం చాలా సంతోషం. ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.
సినిమా పేరు: విరాజి
నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు…
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
పి ఆర్ ఓ: పవన్ పాల్
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్
వి ఎఫ్ ఎక్స్ : అఖిల్
పోస్టర్ డిజైన్స్: జి.దినేష్, గణేష్ రత్నం
స్టిల్స్: మోహన్
అవుట్ డోర్ పబ్లిసిటీ: రత్నకుమార్ శీలం
డిజిటల్ పి ఆర్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్స్
ఆడియో ఆన్: శబరి మ్యూజిక్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…