‘విరాజి’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల

  • మా సంస్థలో నిర్మించిన రెండో చిత్రం విరాజి. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా చేశాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాం. ఇప్పుడు వరుణ్ సందేశ్ హీరోగా విరాజి నిర్మించాం. సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
  • వరుణ్ సందేశ్ లుక్ తో పాటు ట్రైలర్ కు ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. మా స్నేహితుడు సుకుమార్ ద్వారా దర్శకుడు ఆద్యంత్ హర్ష పరిచయం అయ్యారు. ఆయన కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఆకట్టుకునేలా చెప్పాడు. చెప్పడమే కాదు సెట్ లో కూడా అంతే బాగా తెరకెక్కించాడు.
  • వరుణ్ సందేశ్ గత సినిమా నింద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అది మా విరాజి సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నాం. ముందు హీరో క్యారెక్టర్ కు ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. అయితే నాకు హీరోగా నటించి వెళ్లిపోయే వారు మాత్రమే కాకుండా నాకు సినిమా మొత్తం సపోర్ట్ చేసే హీరో కావాలని అనుకున్నాను.
  • ఎందుకంటే నేను కొత్త నిర్మాతను. నాకు అలా సపోర్ట్ చేసే హీరో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. వరుణ్ సందేశ్ యూఎస్ నేపథ్యం ఉన్ పర్సన్. అతని డైలాగ్ డెలివరీ విధానం విరాజికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.
  • మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో విరాజి సినిమాను నిర్మించాం. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదినీ వంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. అయితే హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతని ఫొటోతోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనేది థియేటర్ లో చూడాలి.
  • ఈ నెల 2వ తేదీన మేము ఆగస్టు 2 రిలీజ్ అని అనౌన్స్ చేశాం. నెల రోజులు ప్రమోషన్స్ కు పెట్టుకున్నాం. ఇంతలో కొన్ని సినిమాలు ఆగస్టు 2న రిలీజ్ అని ప్రకటించాయి. ప్రతివారం సినిమాలు వస్తూనే ఉంటాయి. మన సినిమాలో కంటెంట్ ఉంటే తప్పకుండా ఆదరణ పొందుతుంది అని మేము బిలీవ్ చేస్తున్నాం. అందుకే మా డేట్ ను పోస్ట్ పోన్ చేయడం లేదు.
  • విరాజిలో మంచి కంటెంట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంటుందని అంటారనే నమ్మకం ఉంది. ఏ రేంజ్ సక్సెస్ అనేది ఇప్పుడే చెప్పలేం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్లు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. వాళ్లు సినిమా చూసి బాగుందని చెప్పారు. డైరెక్టర్ ఎవరు అని అడిగారు. సెన్సార్ వాళ్ల నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. 100 మినిట్స్ మూవీ. యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 100 థియేటర్స్ పైనే మా విరాజి సినిమా రిలీజ్ కు వస్తోంది.
  • మా సంస్థలో ప్రస్తుతం బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా ఓ మంచి లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాం. అది 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఏడాది చివరలో రిలీజ్ అనుకుంటున్నాం. అన్నారు.
Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

8 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago