సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ ‘విరాజి’ – దర్శకుడు ఆద్యంత్ హర్ష

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు దర్శకుడు ఆద్యంత్ హర్ష

  • మా నేటివ్ ప్లేస్ నెల్లూరు. తిరుపతి లో బయోటెక్నాలజీలో బీటెక్ చేశాను. ఆ తర్వాత ఫారిన్ వెళ్లి బయోటెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్ డీ ఇన్ న్యూరో సైన్స్ చేశాను. అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేశాను. ఈ టైమ్ లోనే నా మూవీస్ కోసం పది కథలు రాసుకున్నాను. 2019లో ఇండియాకు తిరిగి వచ్చాను. దర్శకుడిని కావాలనేది నా కల. అదొక్కటే లక్ష్యంగా పని చేస్తూ వచ్చాను. ఈ క్రమంలో నాకుటుంబ సభ్యులు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఇక్కడికి వచ్చాకు మూడు షార్ట్ ఫిలిమ్స్, 37 నిమిషాల నిడివితో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించాను. ఆ ఫిల్మ్ నచ్చి ఒకరు రెండు లక్షల రూపాయల కు కొనుక్కున్నారు. అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. గతేడాది ‘విరాజి’ కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు చెప్పాను. ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం. నా కథ బాగుందని వినమంటూ మహేంద్రగారికి ఆయన చెప్పడం, నేను వెళ్లి కథ చెప్పడం జరిగింది. ‘విరాజి’ కథ మహేంద్రనాథ్ గారికి బాగా నచ్చింది. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా అని హీరోగా ఎవర్ని అనుకుంటున్నావ్ అని అడిగారు. నాకు మొదటి నుంచి ఈ సినిమా కోసం మైండ్ లో వరుణ్ సందేశ్ ఉండేవారు. ‘విరాజి’ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఆండీ. ఈ పాత్ర ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. వరుణ్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ స్లాంగ్, బాడీలాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని అనిపించింది.
  • వరుణ్ సందేశ్ ను కలిసి కథ చెప్పాను. ఆయన ఫస్టాఫ్ విని బాగుందన్నారు. సెకండాఫ్ విని గూస్ బంప్స్ వచ్చాయి మనం తప్పకుండా ఈ మూవీ చేద్దామన్నారు. అలా ‘విరాజి’ ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఈ సినిమాలోని ప్రతి షాట్ ఎలా ఉండాలో ఆ షాట్ లో వాడే ప్రతి వస్తువు వివరాలు పేపర్ లో రాసుకున్నాం. ఈ సినిమాలో వెయ్యి షాట్స్ ఉంటే వాటికి వెయ్యి పేపర్స్ రెడీ చేసుకున్నాం. చిన్న బడ్జెట్ సినిమాలకు సెట్ లో ఎక్కువ వృథా లేకుండా ఉంటేందుకు ప్రతీది పేపర్ పై డిజైన్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్లాం.
  • సినిమా కంప్లీట్ చేశాక దాదాపు 4 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేశాం. ‘విరాజి’ అనే టైటిల్ కు నాకు అనిపించిన మీనింగ్ చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడు. ‘విరాజి’ అంటే శివుడు అని కూడా కొందరు చెప్పారు. సొసైటీలో ఉన్న కొన్ని ఇష్యూస్ ను తెరపై చూపించాలనేది దర్శకుడిగా నా దృక్పథం. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ వంటి అంశాలు ఉన్నా…అండర్ కరెంట్ గా కొన్ని సోషల్ ఎలిమెంట్స్ చూపిస్తున్నాం. ఇప్పుడు సొసైటీలో ఉన్న ఒక కాంటెంపరరీ ఇష్యూని తెరపైకి తీసుకొస్తున్నాం. మీరు ‘విరాజి’ చూసి బయటకు వచ్చేప్పుడు ఆ పాయింట్స్ మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి.
  • ‘విరాజి’ కథ లైన్ చెప్పాలంటే ఓ పది మంది కొండమీద ఉండే ప్లేస్ కు వెళ్తారు. అది మూసివేసిన పిచ్చాసుపత్రి అని తెలుస్తుంది. వాళ్లు బయటకు వచ్చి చూస్తే వాళ్ల కారు ఉండదు, మొబైల్ లో సిగ్నల్స్ ఉండవు. ఆ టైమ్ లో ఆండీ అనే వ్యక్తి వారి దగ్గరకు వస్తాడు. అతను వచ్చాక ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది ఆసక్తికరంగా సినిమాలో తెరకెక్కించాం.
  • వరుణ్ ఆండీ క్యారెక్టర్ రిచ్ కిడ్. సొసైటీలో పలుకుబడి ఉన్నవారి వారసుడిగా కనిపిస్తాడు. ఎవరికీ భయపడకుండా ఉంటాడు. తలకు రంగు, చెవికి పోగు, సిగరెట్ తాగి నల్లబడిన పెదాలు..ఇలా వరుణ్ లుక్ కొత్తగా ఉంటుంది. హెయిర్ కోసం రియల్ కలర్ వేసుకుని వాడారు. అవన్నీ ఎందుకు అనే జస్టిఫికేషన్ కూడా ఈ క్యారెక్టర్ కు ఉంటుంది. నా దృష్టిలో సస్పెన్స్ థ్రిల్లర్స్ బెలూన్ లాంటివి. దానికి ఏదైనా కాంటెంపరరీ ఇష్యూ జోడించడం గాలి నింపడం లాంటిది. అప్పుడే ఆ బెలూన్ కు బరువు ఉంటుంది. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ తర్వాత అలాంటి పది సినిమాలు చేశాను ఎవరు చూడలేదు అని వరుణ్ అన్నారు. ఈరోజు ప్రేక్షకులకు ఏదైనా కొత్తగా కావాలి. మన సినిమా బాగుంటే అలాంటివి మరో పది వస్తాయి.
  • ఏబెనైజర్ పాల్ మ్యూజిక్ చేశాడు. తన మ్యూజిక్ తో పది రెట్ల ఇంపాక్ట్ ‘విరాజి’కి తీసుకొచ్చాడు. ఈ సినిమాకు విజువల్స్ ఎంత హైలైట్ అవుతాయో, మ్యూజిక్ అంత హైలైట్ అవుతుంది. సినిమాటోగ్రఫర్ నాకెంతో హెల్ప్ ఫుల్ గా ఉన్నారు. ప్రమోదిని, బలగం జయరామ్, రఘు కారుమంచి, వైవా రాఘవేంద్ర, కుశాలీ, మలయాళీ అమ్మాయి అపర్ణ కీలక పాత్రల్లో నటించారు.
  • ‘విరాజి’ సినిమా ప్రివ్యూ చూసి వరుణ్ సందేశ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీకూ నాకూ లైఫ్ ఇస్తుందని ఆయన ప్రశంసించారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన చిత్రమిది. థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది. నేను శంకర్ గారు చేసిన భారతీయుడు సినిమా చూసి సర్ ప్రైజ్ అయ్యా. ఒక సమస్యను ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాలనే ఆరోజే ఇన్స్ పైర్ అయ్యాను. నా కెరీర్ లో అలాంటి మంచి పర్పస్ ఫుల్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

20 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago