ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’… ఆగస్ట్ 2న టీజర్

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను ఆగ‌స్ట్ 2న సాయంత్రం 6 గంట‌ల 45 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌లు తెలిపారు. సోమ‌వారం రోజున‌ టీజ‌ర్‌కు రిలీజ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే విక్రాంత్ ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. త‌న చేతిలో మాస్క్ ఉంది. డార్క్ టోన్‌తో ఉన్న ఈ పోస్ట‌ర్ ప్ర‌తీ ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. 

‘స్పార్క్’ మూవీ షూటింగ్ అంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు టీజ‌ర్ ఎలా ఉంటుందా? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క్రియేట్ అయ్యింది. F3లో మెప్పించిన బ్యూటీఫుల్ మెహ‌రీన్ ఫిర్జాదా ఇందులో క‌థానాయిక. అలాగే రుక్స‌ర్ థిల్లాన్ కూడా ఇందులో హీరోయిన్‌గా మెప్పించ‌నుంది. విక్రాంత్ ఈ సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.  

డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ద‌ర్శ‌క నిర్మాణంలో  అన్ కాంప్రమైజ్డ్‌గా రూపొందుతోన్న ఈ యూనిట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ‘హృదయం’ ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ విలక్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, శ్రీకాంత్, కిర‌ణ్‌  అయ్యంగార్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Tfja Team

Recent Posts

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…

29 minutes ago

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…

37 minutes ago

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…

46 minutes ago

ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

51 minutes ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

23 hours ago