టాలీవుడ్

విజయ్ సేతుపతి ‘ఏసీఈ’ ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో ఆరుముగ కుమార్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనింగ్ ఎ.కె. ముత్తు,  ఆర్. గోవిందరాజ్ ఎడిటింగ్.  ‘ఏసీఈ’ అనే డిఫరెంట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్ గా నిర్మిస్తుంది.

సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో రివీల్ చేసిన ఫస్ట్ లుక్ లో విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్, డైస్ వేస్తూ కనిపించి అందరినీ ఆకర్షించారు. ఇది సినిమా గురించి అభిమానులలో క్యురియాసిటీని పెంచింది. స్టార్ కాస్ట్, ఆకట్టుకునే నేపథ్య సంగీతం, విజయ్ సేతుపతి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. జూదం, తుపాకులు, పేలుళ్లు, రాబరీస్, బైక్ ఛేజింగ్ వంటి అంశాలు అలరించాయి. టీజర్‌లో యోగి బాబు కామిక్ రియాక్షన్ హ్యుమర్ రేకెత్తిస్తుంది.  ఇది సినిమా హిలేరియస్  క్రైమ్-కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలియజేస్తుంది.  ఈ విజువల్ గ్లింప్స్, టైటిల్ ప్రివ్యూ, జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు యానిమేటెడ్ ఫార్మాట్‌లో పాత్రల యొక్క ముఖ్యమైన అంశాలు రివిల్ చేయడం వల్ల ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. సినిమా సింగిల్ ట్రాక్,  టీజర్‌ని అభిమానులందరూ ఆస్వాదించేలా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ టీమ్ అనౌన్స్ చేసింది.

ఈ ఏడాది ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతికి ‘ఏసీఈ’ రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

22 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago