‘బేబీ’ ప్రీమియర్ షోలో విజయ్ దేవరకొండ

సినిమా మీద ప్రేమ చూపిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్..
ఈ సినిమా టీమ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది
‘బేబీ’ ప్రీమియర్ షోలో విజయ్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలించాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయింది. అయితే జూలై 13న వేసిన ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఈ ప్రీమియర్ షోను వీక్షించారు. ప్రీమియర్ షో అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘నేను సినిమా గురించి మాట్లాడటానికి రాలేదు. ఆడియెన్స్ ఇంత బాగా సినిమా మీద ప్రేమ చూపిస్తున్నారు.. ఇక్కడకు వచ్చిన అందరికీ థాంక్స్. సాయి రాజేష్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఎస్‌కేఎన్, ధీరజ్‌లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ఇలా అందరూ కలిసి ఏడిపించారు. ఈ సినిమా టీమ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది నాకు… సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేయండి. సినిమా గురించి మళ్లీ తరువాత మాట్లాడుకుందామ’ని అన్నారు.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘రెండున్నరేళ్లుగా కంటెంట్‌ను మాత్రమే నమ్మి సినిమాను తీశాం. నా స్నేహితుడు సాయి రాజేష్ తీసిన సినిమా. మాస్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ కాదు.. నేను కంటెంట్‌ను నమ్మాను. టాక్సీవాలా తరువాత నేను ఈ సినిమాను తీయాలని అనుకున్నాను. ఈ తరం వాళ్లు ప్రేమలో పడాలన్నా, ప్రేమ గురించి తెలుసుకోవాలన్నా కూడా బేబీ సినిమా వాళ్లకు పుస్తకంలాంటిది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ అద్భుతంగా నటించారు. నన్ను నమ్మి ఆనంద్‌ను విజయ్ నా చేతుల్లో పెట్టాడు. రేపటి నుంచి బేబీ సంచలనాలు సృష్టించబోతోన్నాం. కల్ట్ బొమ్మ ఇచ్చామ’ని అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. నన్ను మొదటి నుంచి నమ్మిన ఎస్‌కేఎన్, మారుతి గారికి థాంక్స్’ అని అన్నారు.

మారుతి మాట్లాడుతూ.. ‘మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఇంత మంచి సినిమాను తీసిన సాయి రాజేష్‌కు థాంక్స్. ఈ సినిమాతో సాయి రాజేష్ నాకు ఫేవరేట్ డైరెక్టర్ అయ్యాడు. మంచి సినిమా తీశాడు. సాయి రాజేష్ మా ఫ్రెండ్ అవ్వడం గర్వంగా ఉంది. ఎస్‌కేఎన్ మూడేళ్లు కష్టపడ్డాడు. ఆనంద్, వైష్ణవి, విరాజ్‌లు అద్భుతంగా నటించారు. రేపటి నుంచి ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుంద’ని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. బయట రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. ఇదంతా మన సినిమాకే జరిగిందా? అని అనిపిస్తుంది. థియేటర్లో అరుపులు వినిపిస్తున్నాయి. ఏడుపులు వినిపిస్తున్నాయి. నన్ను నమ్మి నాకు ఈ సినిమాను ఇచ్చిన సాయి రాజేష్ అన్న, ఎస్‌కేఎన్ అన్నకి థాంక్స్. వైష్ణవి, విరాజ్‌ల సీన్లకు నేను అరుస్తున్నాను’ అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. సినిమా అందరికీ నచ్చుతుంద’ని అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘థియేటర్లో అందరూ అలా అరుస్తుంటే నాకు కొత్తగా ఉంది. నేను నటించిన ఏ సినిమాలకు ఇలా జరగలేదు. ఆనంద్ నటనకు నాకు ఏడుపు వచ్చింది. వైష్ణవి అద్భుతంగా నటించింది. ఇంత ప్రేమను చూపిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ‘సినిమా అద్భుతంగా ఉంది. నాకు నా స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయి. ఆనంద్, వైష్ణవి, విరాజ్‌లు చక్కగా నటించారు. నాకు మామూలుగానే లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టం. సాయి రాజేష్ గారు అద్భుతంగా తీశారు. ఎస్‌కేఎన్ గారు ఎప్పుడూ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంటారు. సంగీతం బాగుంది. ప్రతీ పాట నాకు చాలా నచ్చింది. ఇదో అందమైన ప్రేమ కథ. అందరూ చూసి ఎంజాయ్ చేయండ’ని అన్నారు.

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

24 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

24 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

24 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago