ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Must Read

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్, రశ్మిక జంటగా నటించిన రణబాలి సినిమాను ఆయన వీక్షించారు. ఈ సినిమా చూసిన అనంతరం తన అనుభూతిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సందీప్ రెడ్డి వంగా. రణబాలి సినిమాలో విజయ్ చేసిన యాక్షన్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ యూనిక్ గా ఉందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.

సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ – విజయ్…నీ యాక్షన్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. స్క్రీన్ మీద నీ ఫైట్స్ చూస్తుంటే ఆ ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాం. ఇకపై ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే నీ గురించే చెప్పుకుంటారు. కంగ్రాట్స్ విజయ్. ప్రేక్షకులు రణబాలి సినిమాను విజయ్ ఔట్ స్టాండింగ్ పర్ ఫార్మెన్స్ కోసం చూడాలి. రశ్మిక జయమ్మ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఎంతో రియలిస్టిక్ ఫీల్ ను కలిగించింది. అజయ్ – అతుల్ మ్యూజిక్ మరో హైలైట్ గా నిలిచింది. చరిత్ర నుంచి ఇలాంటి ఒక నేపథ్యాన్ని ఎంచుకుని సినిమాగా రూపొందించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. మన పాఠ్యపుస్తకాల్లో చెప్పని చారిత్రక అధ్యాయాన్ని రణబాలి చూపించింది. అన్నారు.

Latest News

సరోజ్ కుమార్ స్వీయ నిర్మాణంలో రానున్న ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ...

More News