తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హెల్త్ కార్డులను స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద దాసరి హెల్త్ కార్డుగా సభ్యులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ – మా డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీగా మేము ఎన్నికయ్యాక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించాం. మా సంఘంలో సభ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే గతంలో 25 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత అది లక్ష రూపాయలకు పెంచారు. అయితే చాలా మంది సభ్యులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని అడిగేవారు. మేము ఈసారి ఎలక్షన్స్ లో అవసరమైన సభ్యులకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అది కూడా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండా బయట నుంచి ఫండ్స్ సేకరించి అందిస్తామని హామీ ఇచ్చాం. హామీ ఇచ్చినట్లే ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఉచిత హెల్త్ కార్డ్స్ అందిస్తుండటం సంతోషంగా ఉంది. దీనంతటికీ కర్త, కర్మ, క్రియ మా సాయి రాజేశ్. సంఘంలోని 720 మంది అవసరమైన వారు ఈ హెల్త్ కార్డులకు అప్లై చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 1920 మందికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాం. ఈ రోజు మా ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఇతర పెద్దలంతా అతిథులుగా పాల్గొనడం ఆనందంగా ఉంది. అన్నారు.
దర్శకుల సంఘం ఉపాధ్యక్షులు సాయిరాజేశ్ మాట్లాడుతూ – అసోసియేషన్ సభ్యులు హెల్త్ కార్డ్ లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే మా కమిటీలో మొదటి ప్రాధాన్యత కింద ఆ అంశాన్ని చేర్చాం. హెల్త్ కార్డుల విషయం చెప్పగానే చిత్ర పరిశ్రమలోని ఎంతమంది స్పందించి ఆర్థిక సాయం చేశారు. ప్రభాస్ గారు 35 లక్షలు ఇచ్చారు. నా ఫ్రెండ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ 10 లక్షలు, బన్నీ వాస్ గారు, యూవీ వంశీ గారు ఇలా చాలా మంది ఆర్థిక సాయం అందించారు. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయడం కోసమే కొంత టైమ్ పట్టింది. హీరో విజయ్ దేవరకొండ మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఆయన తన ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి హెల్ప్ చేశారు. మీలో ఎవరికీ ఈ హెల్త్ కార్డ్ అవసరం రావొద్దని కోరుకుంటున్నా. అన్నారు
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ఈ రోజు దర్శకుల సంఘం నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా డ్రీమర్స్. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో నేను హీరోగా ఎదగకముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు, భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ మీ కలను సాకారం చేసుకోవడంలో ముందుకు సాగుతుంటారు. ఈ అసోసియేషన్ సభ్యులు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ఈ కమిటీలో ఒక ఎనర్జీ కనిపించింది. తమ సభ్యులకు ఏదో మంచి చేయాలనే తపన కనిపించింది. మధ్యాహ్నం భోజనం పెట్టడం అలాగే ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. ఈ అసోసియేషన్ కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…