విజయ్ ఆంటోని ‘గగన మార్గన్’ ఫస్ట్ లుక్ విడుదల

నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు విజయ్ ఆంటోని. మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లేందుకు గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సగర్వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘గగన మార్గన్’ అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఆంటోని రెండు రకాలుగా కనిపించారు. గాయపడి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ లుక్ కొత్తగా ఉంటే.. నీటి అడుగు బాగాన ఉన్న వ్యక్తి పోస్టర్ కూడా ఇందులో కనిపిస్తోంది.

“అట్టకత్తి”, “బీడ”, “సూదు కవ్వుం”, “ఇంద్రు నేత్ర నాళై”, “తేకడి”, “ముండాసుపట్టి”, “కదలుం కాదందు పోగుం”, “ఏ1”, “మాయవన్” వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్న లియో జాన్ పాల్.. ‘గగన మార్గన్’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. లియో జాన్ పాల్ 2013లో “ఇదర్‌కుతానే ఆసైపట్టై బాలకుమార” చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.

ఈ చిత్రంలో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ వంటి వారు నటించారు.

యువ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, రాజా ఆర్ట్ డైరెక్టర్‌గా, విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజర్‌గా పని చేశారు. ముఖ్యంగా ఈ చిత్రానికి ముంబైలో చిత్రీకరించిన నీటి అడుగున సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.

‘గగన మార్గన్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: విజయ్ ఆంటోని, సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు

సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు : లియో జాన్ పాల్
నిర్మాత : విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్
సమర్పణ: మీరా విజయ్ ఆంటోని
సంగీతం : విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ : యువ ఎస్
ఆర్ట్ డైరెక్టర్: రాజా ఎ
PRO : సాయి సతీష్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

10 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

10 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

10 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago