అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘విడాముయర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే అభిమానులు సహా అందరిలో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆకట్టుకోనుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సమయం వచ్చేసింది.. అందరి అంచనాలను మించేలా ‘విడాముయర్చి’ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేవారు.
‘విడాముయర్చి’ సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ సహా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్..‘విడాముయర్చి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అజిత్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం.తమిళ్ కుమరన్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడాముయర్చి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇప్పుడు విడుదల చేయటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అజిత్‌తో సినిమా చేస్తున్నామని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు వారి సపోర్ట్‌ను అందిస్తున్నారు. వారికి చక్కటి సినిమాను అందించటమే మా లక్ష్యం. అందుకనే మా టీమ్ ఎంతగానో కష్టపడుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ నెలలో సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం. తర్వాతే సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే దాని గురించి అధికారికంగా తెలియజేస్తాం’’ అన్నారు.
కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్పటికే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను సిద్ధం చేవారు. ఓం ప్రకాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేస్తుండగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్), గోపీ ప్రసన్న (పబ్లిసిటీ డిజైనర్), హరిహరసుతన్(వి.ఎఫ్.ఎక్స్), సురేష్ చంద్ర (పి.ఆర్.ఒ-తమిల్), నాయుడు సురేంద్రకుమార్- ఫణి కందుకూరి (పి.ఆర్.ఒ-తెలుగు) సినిమాలో భాగమై వర్క్ చేస్తున్నారు.
అజిత్ కుమార్ ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…