టాలీవుడ్

అందరికీ అందుబాటులో ఉండేలా ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ టికెట్ రేట్లు

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ దసరా సెలవులు ముగియడంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలంగాణలో ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో మరింత కలెక్షన్లు పెరిగేలా కనిపిస్తున్నాయి. వేట్టయన్ మూవీకి ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగేట్టు కనిపిస్తోంది.

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ప్రతి యాక్టర్ కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్‌మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకంగా మారింది.

లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన GKM తమిళకుమారన్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై M షెన్‌బాగమూర్తి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. న్యాయం, అధికారం, ఎన్‌కౌంటర్ హత్య, అవినీతి విద్యా వ్యవస్థ ఇతివృత్తాలను ఈ సినిమాలో ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. వెట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ₹240 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గించడంతో మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

ఆది సాయికుమార్‌, యశ్వంత్, ప్రదీప్ జూలూరు, శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ యూనిక్ క్రైమ్-యాక్షన్ థ్రిల్లర్ ‘SI యుగంధర్’ సినిమా గ్రాండ్ గా లాంచ్

వెరీ ట్యాలెంటెడ్ ఆది సాయికుమార్‌ హీరోగా యశ్వంత్ దర్శకత్వంలో శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ జూలూరు…

3 hours ago

ఘనంగా జరిగిన కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

భారత్ కల్చరల్ అకాడమీ తెలుగు టెలివిజన్ రచయిత సంఘం ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ సారధ్యంలో…

4 hours ago

My Dream is to Build a World-Class Music School: Music Sensation Thaman

Q: How do you manage so many projects and handle them efficiently? At one time,…

1 day ago

ఈశా గ్రామోత్సవం: గ్రామీణ భారత క్రీడా స్పూర్తి ఇంకా సంస్కృతి ఉత్సవం

పరిచయం:2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప జేయడానికి ఉద్దేశించినది. దీనితోబాటు సామాజిక స్పృహ, సంప్రదాయాలు…

1 day ago

Isha Gramotsavam: Celebrating Rural Sports and Culture

Isha Gramotsavam , launched by Sadhguru in 2004, holds immense significance in today's fast-paced world,…

1 day ago

వరల్డ్ క్లాస్ మ్యూజిక్ స్కూల్ కట్టాలనేది నా కల : మ్యూజిక్ సెన్సేషన్ తమన్

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్ని…

1 day ago