‘రానా నాయుడు సీజన్ 2’లో నాగ నాయుడు పాత్ర గురించి చెప్పిన వెంకటేష్ దగ్గుబాటి

‘రానా నాయుడు సీజన్ 2’లో నాగ నాయుడుగా వెంకటేష్ దగ్గుబాటి తిరిగి వచ్చారు. కానీ వెంకటేష్, నాగ నాయుడుకి చాలా తేడా ఉంటుంది. నాగ నాయుడు స్వార్థపరుడు, నియమాలను ఉల్లంఘిస్తుంటాడు. కానీ నిజ జీవితంలో వెంకటేష్ మాత్రం ఇలాంటి వాటన్నంటికీ దూరంగా ఉంటారు.

నాగ నాయుడు కుటుంబం కోసం ఎంతటి వరకు అయినా వెళ్తాడు, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తాడు.. అదే అతన్ని మనం గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. తాను పోషించిన పాత్ర గురించి వెంకటేష్ మాట్లాడుతూ.. ‘నాగ నాయుడు పాత్రని మనం ఊహించలేం. ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం. కానీ అతను తన కుటుంబం కోసం ప్రాణం ఇస్తాడు. అదే నాకు కనెక్ట్ అయిన పాయింట్. నిజ జీవితంలో నాకు ఆ పాత్రకు ఉన్న కనెక్షన్ అదే. మేమిద్దరం మా కుటుంబాలను ప్రేమిస్తాము.. కానీ అక్కడే ఎంతో తేడా ఉంటుంది. నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించగలరు. కానీ నాగ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు.

నాగకి డ్రామా అంటే ఎక్కువగా ఇష్టం. నాకు మైండ్ గేమ్స్ ఆడటం ఇష్టం ఉండదు. నేను ఆడను. కానీ నాగ అలాంటి ఆటల్లో ఆశ్చర్య పరుస్తుంటాడు. అతను ఏమి ఆలోచిస్తుంటాడో మనకు తెలియదు.. అస్సలు ఊహించలేం.. ఈ సారి అభిమానుల్ని మరింతగా ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది’ అని అన్నారు.

రానా నాయుడు సీజన్ 2 మొత్తం యాక్షన్, డ్రామాతో నిండి ఉంటుంది. నాగ నాయుడు 2.0 పూర్తి స్థాయి ధమాకాను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. రానా నాయుడు సీజన్ 2 జూన్ 13 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే

Tfja Team

Recent Posts

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…

4 hours ago

యూవీ కాన్సెప్ట్స్, సంతోష్ శోభన్ “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి ‘గాబరా గాబరా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…

4 hours ago

ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ‘హే భగవాన్‌’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

4 hours ago

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

3 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

3 days ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago