నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ ‘వీరసింహారెడ్డి’ మాస్ మొగుడు పాట జనవరి 3న విడుదల

Must Read

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వీరసింహారెడ్డి’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఒంగోలులో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు.

అంతకంటే ముందు ఈ చిత్రంలోని నాల్గవ, చివరి పాట- మాస్ మొగుడు లిరికల్ వీడియో జనవరి 3వ తేదీ సాయంత్రం 7:55 గంటలకు విడుదల కానుంది. బాలకృష్ణ, శ్రుతి హాసన్ ల రాకింగ్ కెమిస్ట్రీని చూపించే పోస్టర్ ద్వారా సాంగ్ డేట్ ని ప్రకటించారు. బాలకృష్ణ ట్రెడిషనల్ వేర్ లో రాయల్ గా కనిపించగా, శ్రుతి హాసన్ ట్రెండీ డ్రెస్ లో గ్లామర్ గా కనిపిస్తోంది. మాస్ మొగుడు థమన్ మార్క్ మాస్ నంబర్‌ గా ఉండబోతోంది.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్ ఫైట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News