గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారు. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ అంచనాలను పెంచుతోంది.
‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు పాటను లాంచ్ చేయడానికి టైం ని లాక్ చేసారు. సుగుణ సుందరి ఉదయం 9:42 గంటలకు విడుదల కానుంది. ఓ లవ్లీ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ ప్రకటన చేశారు. పోస్టర్‌లో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించగా శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఈ డ్యూయట్ లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించబోతుతున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రం కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ఫస్ట్ సింగిల్ జై బాలయ్యకు అద్భుతమైన స్పందన వచ్చింది.
అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట ‘జై బాలయ్య’ మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్.
ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…