జాన్ అబ్రహం, శర్వారి ప్రధాన పాత్రధారులుగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వేద’. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంటర్‌టైన్‌మెంట్, జె.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘వేద’ అనే అమ్మాయి జీవితాన్ని తెలియజేసే చిత్రమే ఇది. న్యాయం కోసం ఆమె చేసే పోరాటాన్ని చూపించే సినిమా ఇది. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పే ధృఢమైన మనస్తత్వాన్ని, ఎదురు తిరిగి పోరాడే తత్వాన్ని ఈ కథ ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో వేదకు తోడుగా, రక్షణ కవచంగా ఓ మాజీ సైనికుడు నిలబడ్డాడు. అతని అండతో ఆమె ఎంత వరకు పోరాడిందో తెలియజెప్పే కథాంశమే ఈ మూవీ.
‘వేద’ ట్రైలర్ చూస్తుంటే రొమాలు నిక్కబొడిచేంత యాక్షన్ సన్నివేశాలున్నాయని అర్థమవుతుంది. సినిమాలో హై యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. న్యాయం కోసం ప్రమాదకరమైన మార్గంలోకి వేద అనే అమ్మాయి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆమెకు ఎదురయ్యే సవాళ్లను సినిమా మనకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం పేరు వినగానే మనకు ఆయన పోషించిన అద్భుతమైన యాక్షన్ పాత్రలు గుర్తుకు వస్తాయి. ఈ చిత్రంతో మరోసారి ఆయన తనదైన పంథాలో మెప్పించారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ‘‘వేద’ లాంటి సినిమాలో భాగం కావటం నాకెంతో ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. మంచి వైపు నిలబడాలని, పోరాటం చేయాలనే అందరినీ ప్రేరేపించే కథాంశంతో సినిమా తెరకెక్కింది ’ అన్నారు జాన్ అబ్రహం.
చిత్ర దర్శకుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే కేవలం వినోదాన్ని అందించే మాధ్యమం మాత్రమే కాదు. మంచి సందేశాన్ని కూడా అందిస్తుందని నేను నమ్ముతాను. రేపు వేద సినిమా చూసిన తర్వాత చాలా మంచి ప్రేక్షకులకు మనసుల్లో గుర్తుండిపోతుందని గట్టిగా విశ్వస్తున్నాను’’ అన్నారు.
ఉమేష్ కె.ఆర్.బన్సాల్, సీబీఓ, జీస్టూడియోస్ మాట్లాడుతూ ‘‘వేద’ అనేది బలమైన పాత్రలతో కూడిన శక్తివంతమైన కథ. ప్రేక్షకుల మనసులకు హత్తుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు.
ఎమ్మాయ్ ఎంటర్‌టైన్మెంట్ మధు బోజ్వానీ మాట్లాడుతూ ‘‘‘వేద’వంటి సినిమాను ప్రేక్షకులకు అందించటం మా అందరికీ ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. సాధికారితతను తెలియజేస్తూ స్ఫూర్తినింపేలా ఈ చిత్రాన్ని చేయటం అనేది సినిమాపై మాకున్న ప్రేమను తెలియజేస్తుంది. దీన్ని ఆగస్ట్ 15న విడుదల చేస్తుండటం మాకెంతో గర్వ కారణంగా అనిపిస్తోంది’’ అన్నారు.
జాన్ అబ్రహం, శర్వారి ప్రధాన పాత్రల్లో నటించిన ‘వేద’ చిత్రంలో అభిషేక్ బెనర్జీ కీలక పాత్రను పోషించారు. తమన్నా భాటియా స్పెషల్ అప్పియరెన్స్‌లో అలరించబోతున్నారు. అసీమ్ అరోరా రైటర్‌గా వర్క్ చేసిన ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్, ఉమేష్ కె.ఆర్.బన్సాల్, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, జాన్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రానికి మీనాక్షి దాస్ సహ నిర్మాతగా వ్యవహరించారు. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంటర్‌టైన్‌మెంట్, జె.ఎ.ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో రూపొందిన ‘వేద’ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంది.
జీ స్టూడియోస్ గురించి:
ముంబైలో ఉండే జీ స్టూడియోస్ సంస్థ సినిమా నిర్మాణంతో తన ప్రత్యేకతను చాటుకుంటోన్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్‌లు, సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్, టెలివిజన్ కంటెంట్ డెవలప్‌మెంట్, నిర్మాణం, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో 2012 నుంచి ఈ సంస్థ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ది కశ్మీర్ ఫైల్స్, గద్దర్ 2, టువెల్త్ ఫెయిల్ వంటి చిత్రాల నిర్మాణంలో కీలక భూమిక పోషించిన జీ స్టూడియోస్ పలు భాషల్లో తన గ్లోబల్ ఆడియెన్స్ బలమైన కథలను అందించే ప్రయత్నం చేస్తోంది. పలు ఇండియన్ లాంగ్వేజెస్‌లోనూ సినిమాలను అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను అందుకున్న సైరత్, మామ్, సీక్రెట్ సూపర్‌స్టార్, మణికర్ణిక, మిసెస్ ఛటర్జీ వెర్సస్ నార్వే, ది తాష్కెంట్ ఫైల్స్, కిస్మత్ 2, బంగార్రాజు, తునివు, గాడ్ డే గాడ్ డే ఛా వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించి ప్రపంచ వ్యాప్తంగా జీ స్టూడియోస్ తన ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఎమ్మాయ్ ఎంటర్‌టైన్మెంట్:
2011, ముంబైలో ప్రారంభమైన ఎమ్మాయ్ ఎంటర్‌టైన్మెంట్ అండ్ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి వైవిధమ్యైన కంటెంట్‌ను అందించే సంస్థగా రాణిస్తోంది. మోనీషా అద్వానీ , మధు బోజ్వానీ, నిఖిల్ అద్వానీ ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. 12 ఏళ్లలో ఇప్పటి వరకు 30 సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఈ సంస్థ నిర్మించింది. డీ డే, ఎయిర్ లిఫ్ట్, బాట్లా హౌస్, బాజార్, పి.ఒ.డబ్ల్యు-బందీ యుద్ క, సత్యమేవ జయతే, ముంబై డైరీస్, ది ఎంపైర్, అదూరా,, మిసెస్ ఛటర్జీ వెర్సెస్ నార్వే వంటి సినిమాలో ఈ సంస్థ ప్రేక్షకులను అలరించింది.
జె.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్:
డిఫరెంట్ సినిమాలు, ఎవరూ చేయలేని కథాంశాలతో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపే సంస్థలో జె.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్ ముందుంటుంది. 2008 ప్రారంభమైన ఈ సంస్థ విక్కీ డోనర్ వంటి విలక్షణమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రంతో ప్రయాణాన్ని ప్రారంభించింది.ఈ సినిమా ప్రధాన కథాంశం వివాదాస్పదమైనప్పటికీ మేకర్స్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. సినిమా బడ్జెట్‌కంటే పదిహేను రెట్లు కలెక్షన్స్ వచ్చాయంటే సినిమా ఆడియెన్స్‌కి ఎంత బాగా రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మద్రాస్ కేఫ్ వంటి కాంట్రవర్సియల్ పొలిటికల్ థ్రిల్లర్‌ను రూపొందించింది. మాజీ ప్రధాని శ్రీలంక సివిల్ వార్‌లో ఎలా భాగమయ్యారు. దాని వల్ల ఎలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయనే కథాంశంతో సినిమా రూపొందింది. సినిమా బడ్జెట్ కంటే మూడు రెట్లు రాబట్టడమే కాకుండా వివర్శకుల ప్రశంసలను కూడా అందుకుందీ చిత్రం. అలాగే బాట్లా హౌస్, పర్మాను: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్, ఎటాక్, ఫోర్స్ 2 వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…