Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

ఘనంగా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆడియో, వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Must Read

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను తయారు చేశారు. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఈ పాటలను రచించగా.. స్వర కిరీటీ డా. కోటి సంగీత సారథ్యంలో ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను రూపొందించారు. ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను ఆదివారం నాడు గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ఆర్యవైశ్య కుల గురువులు, శ్రీ వాసవీ పీఠం 2వ పీఠాదిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహా స్వామిజీ, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత శ్రీ శైవక్షేత్ర పీఠాదిపతులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివ స్వామిజీ విశిష్ట అతిథులుగా విచ్చేశారు. శ్రీ ఏ.వి.ఎమ్ రావు సంపూర్ణ కార్యనిర్వహణ వహించగా, శ్రీ సిద్దా హనుమంతరావు ఆయనతో పాటుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ గెల్లి రమేశ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వర ప్రసాద్ రెడ్డి, గేయ రచయిత శ్రీ భువన చంద్ర, నటుడు నరేష్ వంటి వారు అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో..

శ్రీ ఏ.వి.ఎమ్ రావు మాట్లాడుతూ.. ‘మా ఈ ప్రయాణంలో జీఎంఆర్ గ్రూఫ్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు (జీఎంఆర్) గారు మాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. కోటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వాసవీ సాక్షాత్కారం ఆల్బమ్‌ను రూపొందించారు’ అని అన్నారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్ చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం. ఈ ఆల్బమ్ కోసం ఆరు నెలలు కష్టపడ్డాం. ఒక్కో పాటను అమ్మ వారే దగ్గరుండి చేయించుకున్నారు. అమ్మ వారి అనుగ్రహం వల్లే ఈ పాటలు ఇంత అద్భుతంగా వచ్చాయి. సౌండ్ డిజైనింగ్, పాటల ప్రజెంటేషన్‌కు ఎక్కువ టైం పట్టింది. అన్ని పాటలకు సౌండింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రతీ ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఈ పాటలుంటాయి. ముందు తరాలకు కూడా అర్థమయ్యేలా రూపొందించాం. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఏ.వి.ఎమ్ రావు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ.. ‘వాసవీ మాత చరిత్ర ఈ ప్రపంచమంతటికీ తెలుసు. ఎన్నో వేదికలపై అమ్మ వారి ప్రవచనాలు చెప్పాను. అమ్మ వారి జీవిత చరిత్రపై పాటలు రాయాలని అనుకున్నాను. ఆ టైంలోనే కోటి గారు ఫోన్ చేసి వాసవీ సాక్షాత్కారం గురించి చెప్పారు. నేను రాసిన పాటలకు కోటి గారు అద్భుతమైన స్వరాలను అందించారు’ అని అన్నారు.

శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహా స్వామిజీ మాట్లాడుతూ.. ‘ ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను కోటి గారు ఎంతో అద్భుతంగా మలిచారు. వాసవీ మాత దేవాలయాల్లో ఈ పాటలు వినిపించేలా సర్క్యులర్ కూడా జారీ చేశాం. ఈ కార్యక్రమానికి రావాల్సిందే అని మమ్మల్ని పదే పదే శ్రీ ఏ.వి.ఎమ్ రావు గారు అడిగారు. వారి నివాసంలో నిత్యం వాసవీ మాత అమ్మవారి కీర్తనలే వినిపిస్తుంటాయి. భగవంతుడిపై దృష్టి సారించేందుకు సంగీతం ఓ సాధనంగా ఉంటుంది. సంగీతానికి అంతటి మహత్తర శక్తి ఉంది’ అని అన్నారు.

శ్రీశ్రీశ్రీ శివ స్వామిజీ మాట్లాడుతూ.. ‘వాసవీ మాత అంటే కేవలం వైశ్యులకు మాత్రమే మాత అని కాదు. మానవాళికి వాసవీ దేవీ మాత. దేవాలయాల కేంద్రంగా ధర్మాల్ని చాటుతుంటాం. వాసవీ కన్యకాపరమేశ్వరి దేవీ జీవిత చరిత్రను ఓ ఆల్బమ్‌గా అద్భుతంగా తయారు చేశారు. ఏ.వి.ఎమ్ గారి సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది. సంగీత దర్శకుడు కోటి అద్భుతమైన స్వరాలు సమకూర్చారు’ అని అన్నారు.

వీడియో సందేశం ద్వారా జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు మాట్లాడుతూ.. ‘బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన పాటలు, కోటి గారి స్వరాలు అద్భుతంగా ఉన్నాయి. అమ్మవారి మహత్యం, విలువలు, త్యాగాల్ని చాటేలా ఈ ఆల్బమ్‌ను చక్కగా మలిచారు. ప్రస్తుత తరానికి వాసవీ మాత విలువ తెలిసేలా ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా పాటను రూపొందించారు’ అని అన్నారు.

భువన చంద్ర మాట్లాడుతూ.. ‘నర సంహారం చేసిన దేవాదిదేవతలెందరో ఉన్నారు. కానీ అహింసా, త్యాగం, ధర్మం, న్యాయం, విచక్షణ తెలిసిన దేవతే కన్యకా పరమేశ్వరి. అందుకే ఆ మాతతో పాటుగా 102 గోత్రాలకు చెందిన వారు అగ్నికి ఆహుతి అయ్యారు. ఎలా జీవించాలో చూపించిన మాతృ మూర్తి వాసవీ మాత. అలాంటి దేవీ జీవిత చరిత్రను వాసవీ సాక్షాత్కారం అంటూ మన ముందుకు తీసుకు వచ్చారు. అందులో పాటను రాసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం’ అని అన్నారు.

నటుడు నరేష్ మాట్లాడుతూ.. ‘ఉదయం సుప్రభాతంతో రోజుని ప్రారంభిస్తాను. ఫ్యూజన్ మ్యూజిక్‌లో కోటి ఈ ఆల్బమ్‌ను సృష్టించారు. భవిష్యత్ తరాలను కూడా ఆకట్టుకునేలా ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. ఇందులో అందరినీ ఆకట్టుకునే మహిమ ఉంది. ప్రతీ ఆలయాల్లో వీరు రూపొందించిన పాటలను, సుప్రభాతంను పెట్టాలి. ఏ.వి.ఎమ్ రావు మంచి వ్యక్తి. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వారికి థాంక్స్’ అని అన్నారు.

డా. కె.ఐ. వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమ్మవారి మీద రాసిన పాటలు.. అందులోని సాహిత్యం, ఆ స్వరాలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. సామవేదం గారు, భువన చంద్ర గారు అమ్మ వారి మహత్యాన్ని చాటేలా సాహిత్యాన్ని అందించారు. ముందు తరాలకు వాసవీ మాత విలువను తెలిసేలా ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. ఇంతటి కార్యక్రమానికి సంకల్పించిన ఏ.వి.ఎమ్ రావు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

డా. గెల్లి రమేశ్ మాట్లాడుతూ.. ‘వాసవీ మాత చరిత్రను తెలిసేలా సామవేదం గారు మంచి సాహిత్యాన్ని అందించారు. ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ని కోటి గారు అద్భుతమైన స్వరాలతో ప్రతీ ఒక్కరూ పాడుకునేలా రూపొందించారు’ అని అన్నారు

ఎ. కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘వాసవీ సాక్షాత్కారం’ కార్యక్రమం తలపెట్టిన ఏ.వి.ఎమ్ రావు గారు, సిద్దా హనుమంతరావు గారికి ధన్యవాదములు. కోటి గారు ఈ ఆల్బమ్‌ను అత్యద్భుతంగా మలిచారు’ అని అన్నారు.

టీటీడీ ప్రధాన అర్చకులు వేణు దీక్షితులు మాట్లాడుతూ.. ‘ఏ.వి.ఎమ్ రావు గారు, సిద్దా హనుమంతరావు గార్లు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మ వారి కీర్తనలను కోటి గారు అద్భుతంగా స్వర పరిచారు. సర్వేజనా సుఖినోభవంతు’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ ఎన్.ఎస్.ఎల్ ప్రవీణ మాట్లాడుతూ.. ‘ కోటి గారి వల్ల నాకు ‘వాసవీ సాక్షాత్కారం’ పాటలకు డైరెక్షన్, కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కోటి గారికి జీవితాంతం రుణ పడి ఉంటాను’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తేజాంజలి వలవల మాట్లాడుతూ.. ‘‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్ ఏ.వి.ఎమ్ రావు గారు, కోటి గారి ద్వారా నా వద్దకు రావడం ఎంతో గొప్ప విషయం. వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. కోటి గారిని గురువుగా పొందడం నా పూర్వ జన్మ సుకృతం’ అని అన్నారు.

Latest News

Experium Would Be Jewel in Hyd Crown Megastar Chiranjeevi

Megastar Chiranjeevi opined that the Experium Eco Park would soon turn into a jewel in Hyderabad's crown. Earlier today,...

More News