ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న నూతన చిత్రం ‘బరి’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో..

వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. ‘నా ‘ముకుంద’ సినిమా తరువాత మళ్లీ మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ‘బరి’ చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయన చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో స్పెషల్‌గా అనిపిస్తుంది. మేం ఇద్దరం కలిసి ఇలా ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది కాదు. కానీ వంశీ తెచ్చిన స్క్రిప్ట్ మా ఇద్దరిని ఇలా కలిపింది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ టీం మీద ఉన్న నమ్మకంతోనే సినిమాకి ఓకే చెప్పాను. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. నేను కూడా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం’ అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘మా నాన్న ఫ్యామిలీ మెంబర్లతో సినిమాలు తీశాడు. వాళ్ల అన్నయ్య, తమ్ముడితో సినిమాలు తీశారు. అలా ఫ్యామిలీ మెంబర్లతో చిత్రాలు నిర్మిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఈ రోజు తెలుస్తుంది. మా అన్న వరుణ్‌తో మూవీని ఈ రోజు ప్రారంభించడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మా మూవీ ప్రారంభోత్సవానికి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతోన్నాం. విలేజ్ డ్రామాగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతోన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరు పోస్టర్ మీద కనిపిస్తే.. ఈ మూవీ కచ్చితంగా చూడాలి.. కచ్చితంగా బాగుంటుంది అని ఆడియెన్స్‌కి అనిపించేలా చేయడమే నా లక్ష్యం. ఈ సినిమా అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.’ అని అన్నారు.

యదు వంశీ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ తరువాత ఓ కథను పట్టుకుని ఏడాది తిరిగా. అది వర్కౌట్ కాలేదు. మధ్యలో నాకు వాలీబాల్ బ్యాక్ డ్రాప్‌తో ఓ ఐడియా వచ్చింది. కొంత కథ రెడీ చేసుకున్నా. వాలీబాల్ అని అనుకోవడంతోనే నాకు వరుణ్ గారు మైండ్‌లోకి వచ్చారు. అలా కొంత కథ అయ్యాక మళ్లీ తిరిగి నిహారిక వద్దకే వెళ్లాను. ఆమెకు ఈ కథను నెరేట్ చేసి వరుణ్ గారు కావాలని అడిగాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక గారు అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను రెడీ చేసి వరుణ్ గారికి వినిపించాం. ఆయనకి కథ చాలా నచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం. నిన్న రాత్రి నాకు వరుణ్ గారు ఫోన్ చేశారు. ఓ గెస్ట్ రాబోతోన్నారు అని నన్ను సర్ ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఈ రోజు ఆయన ఇలా వచ్చి మాలాంటి యంగ్ టీంని ప్రోత్సహించడం, మా వెనుక వరుణ్ గారు, నిహారిక వంటి వారు నిలబడటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ కంటే పది రెట్లు ప్రభావం చూపేలా ‘బరి’లోని మ్యూజిక్ ఉంటుంది. వంశీ గారికి కూడా మ్యూజిక్ పట్ల మంచి టేస్ట్ ఉంది. ఈ చిత్రంలోనూ మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంది. చాలా అద్బుతమైన మ్యూజిక్ రాబోతోంది’ అని అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా మాట్లాడుతూ .. ‘‘బరి’ సినిమాలో నేనొక్కడినే సీనియర్ అనుకుంటా. మిగిలిన వారంతా యంగ్ టీం. నిహారిక గారు చాలా మంచి ప్రొడ్యూసర్. వరుణ్ గారితో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. వంశీ గారి స్టోరీ, ఆయన కాన్ఫిడెంట్ అద్భుతంగా ఉంది. వచ్చే సంక్రాంతికి ‘బరి’ పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.

నటీనటులు: వ‌రుణ్ తేజ్

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: య‌దు వంశీ
నిర్మాత‌: నిహారిక కొణిదెల‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ర‌మేష్ మ‌న్యం
సినిమాటోగ్ర‌ఫీ: ధ‌నుష్ భాస్క‌ర్‌
మ్యూజిక్‌: అనుదీప్ దేవ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: చిన్నా
ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ
కాస్ట్యూమ్స్‌: ఐశ్వ‌ర్య రాజీవ్‌
ఆర్ట్‌: విష్ణు వ‌ర్ధ‌న్ పుల్ల‌
రైట‌ర్స్‌: వెంక‌ట సుభాష్ చీరాల‌, ఉత్త‌మ్ లెక్క‌ల‌, విక్కీ మా, రంజిత్ మారెడ్డి
కో డైరెక్ట‌ర్‌: ర‌వి శంక‌ర్‌.డి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బెక్కం ర‌వీంద‌ర్‌
స్టిల్స్‌: వ‌ర‌హాల మూర్తి
పి.ఆర్‌.ఒ: బియాండ్ మీడియా(సురేంద్ర కె.నాయుడు, ఫ‌ణి కందుకూరి)

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

14 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago