త్వరలో స్ట్రీమింగ్ కు రాబోతున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్”

Must Read

ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్ ను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్” త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది.

ప్రతి కేసుకు ఒక కథ ఉంటుంది, ఈ కేస్ లో నిజం ఏంటి అనే క్యాప్షన్ తో “నా వైఫ్ మిస్సింగ్” అప్డేట్ ఇచ్చింది ఆహా. తన భార్య మిస్సయ్యిందంటూ వరుణ్ సందేశ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడాన్ని గతంలో రివీల్ చేసింది ఆహా. ఇప్పుడా కేసులో ఉన్న నిజం ఏంటో సిరీస్ లో చూడాలనే క్యూరియాసిటీ ఆడియెన్స్ లో క్రియేట్ అవుతోంది. త్వరలో “నా వైఫ్ మిస్సింగ్” స్ట్రీమింగ్ డేట్ ను ఆహా ఓటీటీ అనౌన్స్ చేయబోతోంది. కొత్త బంగారులోకం వంటి సూపర్ హిట్ సినిమా చేసిన పెయిర్ వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

Latest News

ఒక్కడిగా వచ్చి.. ఒక బ్రాండ్‌గా ఎదిగి.. హ్యాపీ బర్త్ డే సురేశ్ కొండేటి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.. తెలుగు సినీ పరిశ్రమలో ‘సంతోషం’ సురేష్‌గా అందరికీ సుపరిచితులైన సురేష్...

More News