వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్, దోస డైరీస్ ప్రొడక్షన్ నంబర్ 1 ‘సరస్వతి’ షూటింగ్ పూర్తి

Must Read

తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్, తానే ప్రధాన పాత్రలో నటిస్తూ పక్కా ప్లానింగ్, క్లియర్ విజన్‌తో అనుకున్న సమయానికి షూటింగ్‌ను పూర్తిచేశారు. ఫైనల్ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ‘సరస్వతి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది.

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్  స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది.

ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..  సరస్వతి చిత్ర షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో నాకు పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కు, టెక్నీషియన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ప్రారంభించబోతున్నాం.

ఈ చిత్రంలో జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సంగీత సంచలనం థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, ఎ.ఎం. ఎడ్విన్ సకే కెమెరా మ్యాన్. వెంకట్   ఎడిటర్, సుధీర్ ఆర్ట్ డైరెక్టర్. ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

తారాగణం:  వరలక్ష్మి శరత్‌కుమార్, జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, కిషోర్ కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి, మైమ్ గోపి, హరేష్ పరేడే, తులసి, రఘు బాబు, దేవీ ప్రసాద్, వెంకట్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – వరలక్ష్మి శరత్ కుమార్
నిర్మాతలు – పూజా శరత్ కుమార్ & వరలక్ష్మి శరత్ కుమార్
సహ దర్శకుడు: నరేష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్ డేనియల్
సినిమాటోగ్రాఫర్: ఎడ్విన్ సకాయ్
సంగీతం: థమన్
ఎడిటర్ : వెంకట్
ఆర్ట్ డైరెక్టర్ : సుధీర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: విక్రమ్ స్వామి
ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్
పీఆర్వో- వంశీ శేఖర్

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News