టాలీవుడ్

V మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మొదటి చిత్రం ‘ది ఇండియా హౌస్’

రామ్ చరణ్, విక్రమ్ రెడ్డిల V మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మొదటి చిత్రం ‘ది ఇండియా హౌస్’ పవర్ ప్యాక్డ్ మోషన్ వీడియో ద్వారా అనౌన్స్ మెంట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ప్రొడక్షన్ బ్యానర్ ‘వి మెగా పిక్చర్స్’ని ప్రారంభించడం ద్వారా తన కెరీర్‌ లో ఒక కీలకమైన అడుగు వేశారు. వినూత్న కథలని రూపొందించడం తో పాటు చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంగా యూవీ క్రియేషన్స్‌ కి చెందిన తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి V మెగా పిక్చర్స్ కు శ్రీకారం చుట్టారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్… ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి నిజ, వాస్తవమైన కంటెంట్‌ కి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్.

 ‘వి మెగా పిక్చర్స్’, ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ తమ మొదటి ప్రాజెక్ట్ – ‘ది ఇండియా హౌస్’ ని అనౌన్స్ చేశారు. ఈ అసోసియేషన్ తొలి ప్రాజెక్ట్ లో ప్రతిభావంతులైన నటులు, నైపుణ్యం కలిగిన టెక్నికల్ టీమ్ భాగమయ్యారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్ స్టార్ లైన్-అప్.

ఈరోజు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పవర్ ప్యాక్డ్ వీడియో ని విడుదల చేశారు.  

ప్రేక్షకులను ఒక కాలానికి తీసుకెళ్లి, వారి హృదయాలను హత్తుకుని కథలో లీనమయ్యేలా ఇండియా హౌస్ సిద్ధమైంది. లండన్‌ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన నేపథ్యంలో టీమ్ టీజర్‌ ను విడుదల చేసింది. ఈ చిత్రం ది ఇండియా హౌస్ చుట్టూ రాజకీయ అలజడి సమయంలో ఒక ప్రేమకథ ను చూపిస్తుంది. రాబోయే డ్రామాను సూచిస్తూ.. ఇండియా హౌస్ కాలిపోతున్న దృశ్యంతో టీజర్ ముగుస్తుంది.  

V మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో శక్తివంతమైన భాగస్వామ్యానికి నాంది పలికింది.

గ్లోబల్ ఫోర్స్‌గా పేరుపొంది, దేశం గర్వించేలా చేశారు రామ్ చరణ్. అభిషేక్ అగర్వాల్ కంటెంట్ ఆధారిత సినిమాలను నిర్మించాలనే దృక్పథంతో అత్యుత్తమ నిర్మాతలలో ఒకరిగా ప్రశంసలు అందుకున్నారు.

భారతీయ సినిమానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి!

Tfja Team

Recent Posts

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…

1 hour ago

జియో స్టార్ సరికొత్త కార్యక్రమం ‘సౌత్ బౌండ్’ టీజ‌ర్ విడుద‌ల‌

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…

1 hour ago

లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే

యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే (DDLJ) 30 వ‌సంతాల సంద‌ర్బంగా…

1 hour ago

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago