‘ఉత్సవం’ రూటెడ్ స్టొరీ. రెజీనా కసాండ్రా

Must Read

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ రెజీనా కసాండ్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘ఉత్సవం’లో మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి ?,
-డైరెక్టర్ అర్జున్ సాయి గారు ఈ కథ నెరేటివ్ చేసినప్పుడు వెరీ బ్యూటీఫుల్ గా అనిపించింది. ఈ కథలో సోల్ వుంది. నాటక రంగం గురించి ఆయన చాలా రిసెర్చ్ ఈ కథని రాసుకున్నారు. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న రూటెడ్ స్టొరీ ఇది. అది నాకు చాలా నచ్చింది.

-అర్జున్ సాయి సెన్సిబుల్ డైరెక్టర్. ఆడియన్స్ కి థియేటర్స్ కి తీసుకురావడానికి ఎలిమెంట్స్ కావాలో తెలిసిన డైరెక్టర్. చాలా అద్భుతమైన నటులు ఇందులో వున్నారు. అలాగే డీవోపీగా రసూల్ గారు, మ్యూజిక్ అనూప్ రూబెన్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?
-ఇందులో నేను కార్పోరేట్ ఎంప్లాయ్ గా కనిపిస్తాను. తనకి లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ వుండదు. చాలా ఇండిపెండెంట్. నా క్యారెక్టర్ ఇండిపెండెంట్ విమెన్ రిలేట్ చేసుకునేలా వుంటుంది. కథలో చాలా కీలకంగా వుంటుంది. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది.  

మీరు చిన్నప్పడు స్టేజ్ ప్లేస్ చేసేవారా?
-నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్లేస్ ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్ లో ప్లేస్ చేశాను.

-ఈ సినిమాలో రంగస్థలం నటులు గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు వున్నాయి. అవన్నీ ఆడియన్స్ ని హత్తుకునేలా వుంటాయి.

దిలీప్ ప్రకాష్ గురించి ?
-దిలీప్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. చాలా పాజిటివ్ సోల్. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ తో వుంటారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.

-ఈ సినిమాలో పని చేసిన అందరూ చాలా సిన్సియర్ గా పని చేశారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు థియేటర్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. చాలా నేర్చుకున్నాను.

మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది ?
-ఇది చాలా మంచి సినిమా. డైరెక్టర్ అర్జున్ సాయి తన తొలి సినిమాగా ఇలాంటి గొప్ప కథని చెప్పాలని అనుకున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ సపోర్ట్ చేయడం, వారు తెలుగులో గ్రాండ్ గా విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది.

షార్ట్ టైం గోల్స్ ఉన్నాయా?
-నా ఫస్ట్ సినిమా ఎస్ఎంఎస్ చేసినప్పుడే  వెర్సటైల్ యాక్టర్ గా వుండాలని భావించాను. అది నా నుంచి ఎప్పుడూ దూరం కాకుండా ఇన్నాళ్ళు పాత్రలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?
గోపిచంద్ మలినేని, సన్నీ డియోల్ గారి సినిమా చేస్తున్నాను. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ వున్నాయి. అవి మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News