టాలీవుడ్

ఉషా ప‌రిణ‌యం టీజ‌ర్ విడుద‌ల

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.


ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. శ‌నివారం ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత విజ‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ ఉషా ప‌రిణ‌యం ప్రేమ‌కు నా నిర్వ‌చ‌నం,ఇదొక మంచి ల‌వ్‌స్టోరి, సినిమా ల‌వ‌ర్స్‌కు ఫుల్‌మీల్స్ లా వుంటుంది. అన్ని ఎమోష‌న్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో నా టెక్నిషియ‌న్స్‌, ఆర్టిస్ట్‌ల‌తో పాటు నా కుటుంబ స‌భ్యులు కూడా ఎంతో స‌పోర్ట్ చేశారు. ఈ సినిమా సంగీతంలో ధ్రువ‌న్ విశ్వ‌రూపం చూస్తారు. ఈ సినిమా కెరీర్‌లో నిలిచిపోతుంది. మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ అత‌ను. నేప‌థ్యం సంగీతం కూడా ఎంతో బాగుంటుంది. నా కూతురు శ్యామ‌ల ఈచిత్రానికి హీరో, హీరోయిన్‌కు కాస్య్టూమ్ డిజైన‌ర్‌గా కాకుండా నాకు ఈ ప్రొడ‌క్ష‌న్ విష‌య‌లో ఎంతో హెల్ప్ చేసింది. కో డైరెక్ట‌ర్ కాళేశ్వ‌ర్ స‌హ‌కారం కూడా మ‌రువ‌లేనిది.

ఈ చిత్రం హీరోయిన్ త‌న్వీ కూడా నా ఫ్యామిలీ మెంబ‌ర్‌. చాలా మంచి బిహేవియ‌ర్ హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌. క‌మ‌ల్ నేను అనుకున్న పాత్ర‌కు న‌టుడిగా హాండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం చేశాడు. మళ్లీ అన్ని ఎమోష‌న్స్ మేళ‌వింపుతో ఓ మంచి సినిమాను తీశాన‌న్న కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను అన్నారు. హీరో శ్రీ క‌మ‌ల్ మాట్లాడుతూ చిన్న‌ప్ప‌టి నుండి నాన్న గారికి ద‌గ్గ‌ర స్కూల్ ఎగ్గొట్టానికి, అబ‌ద్డాలు చెబుతూ యాక్ట్ చేసేవాడిని. అంద‌రి స‌పోర్ట్‌తో ఈ సినిమా కంప్లీట్ చేశాం. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చాడు అన్నారు. తాన్వి ఆకాంక్ష మాట్లాడుతూ నాకు ఇంత పెద్ద అవ‌కాశం ఇచ్చి.. నా డ్రీమ్ నెర‌వేర్చినందుకు ద‌ర్శ‌కుడు కు కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. అంద‌రితో ప‌నిచేయ‌డం ఎంతో గొప్ప‌గా వుంది. నాకు ల‌భించిన గొప్ప అవ‌కాశం ఇది. అన్ని ఏజ్ గ్రూప్‌ల‌కు న‌చ్చే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. టీజ‌ర్‌తో పాటు సినిమా కూడా అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌ల‌తో పాటు ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, ఫ‌ణి, కాళేశ్వ‌ర్‌, శ్యామ‌ల‌, ముత్యాల స‌తీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


శ్రీ‌క‌మ‌ల్, తాన్వి ఆకాంక్ష‌, సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ, వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌, ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత :కె.విజ‌య్‌భాస్క‌ర్

Tfja Team

Recent Posts

‘L2E: ఎంపురాన్’ థియేట్రికల్ ట్రైలర్…

ఖురేషి అబ్‌రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌, కంప్లీట్‌యాక్ట‌ర్‌ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌…

9 hours ago

American actor Kyle Paul took to supporting role in Toxic

American actor Kyle Paul took to his social media to share his thoughts about starring…

9 hours ago

య‌ష్ లేటెస్ట్ యాక్ష‌న్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో న‌టుడిగా గొప్ప అనుభ‌వాన్ని పొందాను – అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

రాకింగ్ స్టార్ య‌ష్.. లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ గురించి అమెరికన్…

9 hours ago

Star boy Siddhu Jonnalagadda, Bommarillu Baskar, and BVSN Prasad’s JACK team ropes in the talented Sam CS to compose the background score

Star boy Siddhu Jonnalagadda's upcoming film "Jack - Konchem Krack" directed by Bommarillu Bhaskar is…

1 week ago

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ - కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు.…

1 week ago

ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై…

2 weeks ago