ఉపాసన కొనిదెల, వెల్‌నెస్ ఇండస్ట్రీలో ఓ శక్తిగా ఉన్న ఆమె తొలిసారిగా మహిళలకు వ్యాపార రంగంలో సుస్థిరమైన వ్యవస్థను సృష్టించటం కోసం తనతో చేరమని పిలుపునిస్తున్నారు. మహిళలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వ్యాపార వేదికను ప్రారంభిస్తున్నారు.
ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఉపాసన, మహిళల విజయానికి అవసరమైన మార్గదర్శకత్వం, వనరులు, అవకాశాలను అందించేందుకు తాను ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నట్టుగా చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని, పాత పద్దతులను పక్కన పెట్టి వ్యాపార రంగంలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ఉపాసన లక్ష్యం :
మహిళల్లో ఉన్న సృజనాత్మకత, నాయకత్వం, సామాజిక పరిస్థితులను మార్చే శక్తికి ఓ వేదికను నిర్మించాలి. ‘నేను ప్రతి మహిళా వ్యాపారవేత్తను వెల్‌నెస్ ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ఓ శక్తివంతమైన వేదికను నిర్మిద్దాం. అందరి సహకారంతో ఎంతటి పోటిలో అయినా గెలుపు సాధించవచ్చు. మన సమిష్టి శక్తితో వెల్‌నెస్ రంగంలోకి రాబోయే కొత్త తరానికి మార్గం వేద్దాం. కలిసి ఎదుగుదాం’ అంటూ పిలుపునిచ్చారు ఉపాసన.
ఈ కార్యక్రమంలో భాగం కావాలనుకుంటున్న వారు, తమ వ్యాపారం సమాజంపై కలిగించే ప్రభావం, ప్రపంచానికి జరిగే మంచి అలాగే ఉపాసనను సహ వ్యవస్థాపకురాలిగా ఎందుకు కోరుకుంటున్నారనే విషయాలను వివరిస్తూ ఓ మెయిల్‌ను cofounder@urlife.co.inకు పంపాలని కోరారు .
వెల్‌నెస్ భవిష్యత్తును తిరిగి పునర్నిర్మించడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఉపాసనతో చేరండి.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…