ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. గత ఏడాది విడుదలైన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని.. బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి ఇది కొనసాగింపు. చోళుల గురించి తెలియజేసే సినిమా ఇది. అత్యద్భుతమైన విజువల్స్‌తో లార్జర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మణిరత్నం సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నారు.
భారీ తారాగణంతో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 1 దాని కొనసాగింపు పీఎస్ 2 పై క్యూరియాసిటీని పెంచుతూ ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆడియెన్స్ పొన్నియిన్ సెల్వన్ 2 ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో `పొన్నియిన్ సెల్వన్ 2` విడుదలవుతుంది. దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్‌ను మార్చి 29న చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సొన్నియిన్ సెల్వన్ 2లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రభు, లాల్, కిషోర్, అశ్విన్ కాకమాను, ఐశ్వర్య లక్ష్మి ఇతర పాత్రల్లో నటించారు. చెన్నైలో పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్‌తో పాటు ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాల నటించిన నటీనటులతో పాటు ఇతర సెలబ్రిటీలు ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ట్రైలర్‌తో పీఎస్ 2పై ఉన్న మరింతగా పెరిగాయి.
ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…