యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్‌లో 1996లో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భారతీయుడు’గా విడుదల చేసింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భారతీయుడు 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే .
భారతీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచనాలుంటాయో వాటిని మించేలా డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2ను విజువల్ వండర్‌గా ఆవిష్కరిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శరవేగంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
పోస్టర్‌ను గమనిస్తే.. తెల్లటి ధోతి, కుర్తాలో కమల్ హాసన్ కనిపిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఎంత స్వచ్చంగా ఉండాలో అంతటి స్వచ్చత పోస్టర్‌ను ప్రస్పుటంగా కనిపిస్తోంది. జీరో టాలరెన్స్ (తప్పును అస్సలు భరించలేను) అని పోస్టర్‌పై ఉన్న లైన్ చాలా ప్రభావవంతంగా ఉంది. ఇక కమల్ హాసన్ కూడా సీరియస్, ఇన్‌టెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే మనదేశాన్ని అవినీతి క్యాన్సర్‌లా పట్టి పీడిస్తోంది. ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈ పోస్టర్‌తో వివరించే ప్రయత్నం చేశారు. ధూమపానానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనల నుంచి ప్రేరణతో ఈ పోస్టర్‌ను తయారు చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.
నటీనటులు:
కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: ఎస్.శంకర్, స్క్రీన్ ప్లే: ఎస్.శంకర్, బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్, మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, ఆర్ట్: ముత్తురాజ్, స్టంట్స్: అనల్ అరసు, నిర్మాత: సుభాస్కరన్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, బ్యానర్స్: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…