‘ఉగ్రం’ నాకెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్మూవీ: అల్లరి నరేష్

*అల్లరి నరేష్, విజయ్ కనకమేడల, షైన్ స్క్రీన్స్ ‘ఉగ్రం’ ఫస్ట్ సింగిల్ దేవేరి విడుదల

నాంది’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. అల్లరి నరేష్‌ ని ఫెరోషియస్ పోలీస్‌ గా చూపించిన ఉగ్రం టీజర్‌ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్  సింగిల్ దేవేరి సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. విన్న వెంటనే మనసుకు ఎంతగానో నచ్చేసే పాటిది. ట్యూన్, లిరిక్స్, కంపోజిషన్‌ మనసుల్ని ఆకట్టుకుంటాయి. శ్రీచరణ్ పాకాల మెలోడి, రొమాంటిక్ నెంబర్ ని అందించారు. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకోగా అనురాగ్ కులకర్ణి మ్యాజికల్ వాయిస్ మరింత మాధుర్యాని తెచ్చాయి. అల్లరి నరేష్, మిర్నాల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ పాట లీడ్ పెయిర్‌ ఒకరికొకరు ఉన్న అనురాగాన్ని ప్రజంట్ చేస్తోంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ముందుగా ఆస్కార్ గెలుచుకొని దేశం పర్వపడేలా చేసిన ఆర్ఆర్ఆర్ టీం కు అభినందనలు. ప్రేక్షకులకు నచ్చితే అన్ని రకాల పాత్రలని చూస్తారు. ఉగ్రం సినిమాని చాలా ఇష్టపడి కష్టపడి చేశాం. దేవేరి పాట రాసిన శ్రీమణి గారికి పాడిన అనురాగ్ కులకర్ణి గారికి థాంక్స్. శ్రీ చరణ్ చాలా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత సాహు గారపాటి, హరీష్ పెద్ది గారి కృతజ్ఞతలు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. నా కెరీర్ లో ఉగ్రం హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. సమ్మర్ లోఉగ్రం మీ ముందుకు రాబోతుంది. నాంది సినిమాని ఎంతలా ప్రోత్సహించారో అలాగే ఈ సినిమాని ప్రోత్సహించి పెద్ద హిట్ చేయాలని, ఈ టీం జర్నీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మిర్నా మాట్లాడుతూ.. ఉగ్రంలో దేవేరి నా ఫేవరేట్ సాంగ్. ఇందులో ఇంకొన్ని అందమైన పాటలు వున్నాయి. త్వరలోనే విడుదల చేస్తాం. దేవేరి పాటకు మీ రీల్స్ కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు  

విజయ్ కనకమేడల మాట్లాడుతూ..  శ్రీచరణ్  చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నేపధ్య సంగీతం ఇంకా అద్భుతంగా వుంటుంది. ‘ఉగ్రం’ నరేష్ గారికి మరో డిఫరెంట్ ఫిల్మ్ కాబోతుంది. మిర్నా ఈ పాట కోసం చాలా కష్టపడింది. సినిమా యూనిట్ అందరికీ థాంక్స్’’ చెప్పారు.   

శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. దేవేరి ఉగ్రం నుంచి మొదటి మెలోడి. చాలా డిఫరెంట్ మూవీ. సౌండింగ్ కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది. థియేటర్ లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. నిర్మాతలు, తూము వెంకట్, విజయ్ మాస్టర్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. 

యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ‘ఉగ్రం’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌ గా నిర్మిస్తున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.

సిద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

ఈ ఏడాది వేసవిలో  ‘ఉగ్రం’  థియేటర్లలో విడుదల కానుంది. 

తారాగణం: అల్లరి నరేష్, మిర్నా

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

బ్యానర్: షైన్ స్క్రీన్స్

కథ: తూమ్ వెంకట్

డైలాగ్స్: అబ్బూరి రవి

డీవోపీ: సిద్

సంగీతం: శ్రీచరణ్ పాకాల

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago