టాలీవుడ్

ఉదయ్ శంకర్, మేఘా ఆకాష్ ల కొత్త సినిమా ప్రారంభం

ప్రతిభావంతమైన నటుడిగా  పేరు తెచ్చుకున్న ఉదయ్ శంకర్ హీరోగా కొత్త సినిమా హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ టెంపుల్ లో ప్రారంభం అయింది. మన్మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై డాక్టర్ సౌజన్య ఆర్ అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ముహూర్త షాట్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీరామ్ సార్ క్లాప్ కొట్టగా.. దినేష్ చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


ఈ సంధర్భంగా నటుడు మధునందన్ మాట్లాడుతూ.. శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ లో రెండో సినిమా స్టార్ట్ అయింది. నారాయణరావుగారు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న మన్మోహన్ నా సొంత బ్రదర్. ఈ అవకాశం ఇచ్చిన నారాయణ రావుగారికి థ్యాంక్యూ. ఇదే బ్యానర్ లో మరోసారి ఉదయ్ హీరోగా నటిస్తుండటం హ్యాపీగా ఉంది. ఉదయ్ కి ఈ చిత్రం సూపర్ హిట్ ఇస్తుందని చెప్పగలను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మొత్తం నేను చదివాను. అందుకే ఉదయ్ కి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అతన్ని నెక్ట్స్ లీగ్ లోకి తీసుకువెళుతుందనుకుంటున్నాను. శ్రీ రామ్ మూవీస్ బ్యానర్ తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్  ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్యూ..’ అన్నారు.


హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..  హీరోగా నాకు ఇది ఐదో సినిమా. ఈ బ్యానర్ లో రెండో సినిమా. నిర్మాత నారాయణరావుగారితో మరోసారి అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఓ రకంగా ఇది ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాంటిదే. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ తర్వాత మధునందన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో అతనికి చాలా ఇంపార్టెంట్ రోల్. హిలేరియస్ గా సాగే ఎగ్జైటింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మధునందన్ బ్రదర్ తన డెబ్యూ మూవీతో మన్మోహన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకు కావాలి.. ’అన్నారు.

దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ..  శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ టూ ముహూర్తం జరిగింది. దర్శకుడుగా ఇది నాకు ఫస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నారాయణరావుగారికి, హీరో ఉదయ్ కి థ్యాంక్యూ. నా కెరీర్ మొత్తం నన్ను సపోర్ట్ చేస్తున్న నా బ్రదర్ కూ థ్యాంక్స్. ఈ మూవీ ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ఈ షెడ్యూల్ లో మొత్తం కాస్ట్ క్రూ ఉంటుంది. ఇది ఫ్యామిలీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఒక చిన్న ప్రేమకథ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీ అందరికీ ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ మొత్తం జర్నీలో మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.



నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ…  శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ టూ కూడా ఉదయ్ తోనే మొదలుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా గురువు గారు శ్రీరామ్ సార్ కీ, నా మిత్రుడు దినేష్ చౌదరికీ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ మూవీ కథ చాలా బావుటుంది. స్క్రిప్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఉదయ్ శంకర్ తో పాటు హీరోయిన్ మేఘా ఆకాశ్ పాత్రలు చాలా బావుంటాయి. మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ జాంబిరెడ్డి ఫేమ్ అనిత్ కుమార్ అందిస్తున్నారు. మంచి కాస్ట్ అండ్ క్రూతో వస్తున్న ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.


ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతోన్న ఈ చిత్రంలో నటీ నటులు :
ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్, మధునందన్, వెంకటేష్ కాకమాను, శశి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : అనిత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : షర్మేల యొలిశెట్టి
కాస్ట్యూమ్ డిజైనర్ : జోష్యుల గాయత్రిదేవి
పిఆర్వో : జిఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సాయి కృష్ణ, వెంకీ, కిశోర్
నిర్మాత : అట్లూరి నారాయణరావు
రచన, దర్శకత్వం : మన్మోహన్ మేనంపల్లి

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago