అందరి ఫేవరెట్ సూపర్ హీరో ‘స్పైడర్-మ్యాన్’ కొత్త సినిమా “స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” నుండి రెండు అద్భుతమైన పోస్టర్లను సోనీ పిక్చర్స్ ‘సినిమాకాన్ 2026’లో విడుదల చేసింది. ఈ సినిమా జూలై 31, 2026న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
సోనీ హెడ్ టామ్ రోత్‌మాన్ ఈ పోస్టర్లను ఆవిష్కరిస్తూ… “ఇలాంటి స్పైడర్-మ్యాన్ సినిమాను మేం ముందెన్నడూ తీయలేదు, ఇందులో హీరో టామ్ హాలండ్ నటన అద్భుతంగా ఉంటుంది” అని ప్రశంసించారు. అలాగే టామ్ హాలండ్ మాట్లాడుతూ… “ఇది ఇప్పటివరకు వచ్చిన స్పైడర్-మ్యాన్ చిత్రాలలో అత్యంత ఎమోషనల్, మెచ్యూర్డ్ సినిమా” అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలను పెంచుతూ రికార్డులు సృష్టిస్తోంది.
డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టామ్ హాలండ్, జెండయా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, మార్క్ రఫ్ఫలో తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఈ చిత్రాన్ని అన్ని ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
హైదరాబాద్: జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (Motive for…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…