కమిట్‌మెంట్ ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు చేసే మంచిపనుల వల్ల పదిమందికి ఉపయోగం ఉంటే ఆ పని జాతికి గర్వకారణం అంటారు. మెగాస్టార్ చిరంజీవి యం.పిగా ఉన్నప్పుడు 2012–14ల మధ్యకాలంలో గుంటూరు జిల్లా తెనాలి పక్కన ఉన్న కొల్లిపర మండలంలోని చక్రాయపాలెం గ్రామంలో చక్రాయపాలెం కమ్యూనిటి హాలును నిర్మించటానికి 25లక్షల రూపాయల యం.పి నిధులను కేటాయించారు.
ఆ నిధులు సరిపోక కమ్యూనిటి హాలు నిర్మాణం ఆగిపోయింది. చక్రాయపాలెం గ్రామాన్ని తన సొంత గ్రామంగా భావించే మచిలీపట్నం యం.పి వల్లభనేని బాలశౌరి ఆగిపోయిన కమ్యూనిటీ హాలు నిర్మాణం పూర్తి అవ్వటానికి కావాల్సిన 40లక్షల రూపాయల నిధులను అందించి నాలుగు నెలల్లో నిర్మాణాన్ని పూర్తిచేస్తాను అంటూ ముందుకొచ్చారు.
ఆ కమ్యూనిటీ హాలుకు మెగాస్టార్ చిరంజీవి హాలుగా నామకరణం చేస్తాం అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్టర్‌లో తెలియచేశారు. ఇటువంటి మంచి పనులే కదా! చరిత్రలో నిలిచిపోయేది అని వారిద్దరి పెద్దమనసులను గురించి పలువురు ట్వీటుకుంటున్నారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…