తులసీవనం’ అందరికీ కనెక్ట్ అవుతుంది. తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్

క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘తులసీవనం’. ఈటీవ్ విన్ ఓటీటీ వేదికగా మార్చి 21 నుంచి ప్రసారం కానున్న నేపధ్యంలో యూనిట్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ని చేసింది.

”జనరల్ గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా .. అవి ఇట్ల అనగానే అట్ల జరిగిపోతాయి’ అంటూ తులసి( అక్షయ్) డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.  ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్  ఎలిమెంట్స్ చాలా ఫ్రెష్ గా నేచురల్ గా అలరించాయి. స్ట్రీట్ క్రికెట్ టోర్నమెంట్ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు నవ్వులుపంచాయి. అక్షయ్, ఐశ్వర్య, విష్ణు తమ కామిక్ టైమింగ్ తో కడుపుబ్బానవ్వించారు. దర్శకుడు అనిల్ రెడ్డి న్యూ ఏజ్ కంటెంట్ ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. స్మరన్ నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేయగా, ప్రేమ్ సాగర్ కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. స్టార్ ఎడిటర్ రవితేజ గిరిజాల ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. మొత్తానికి ట్రైలర్ తులసీవనం పై చాలా క్యురియాసిటీని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అనిల్, తులసి పెళ్లి చూపులు నుంచి నాకు సహాయ దర్శకులుగా వున్నారు. మాది విడదీయలేని ఓ అనుబంధం(నవ్వుతూ).  తులసి అనే పేరు పెట్టాడు కానీ ఇది అనిల్ పిక్చరే. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్ దృష్ట్యా కొన్ని భయాలు వుంటాయి.  ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వెనుక అందరి కృషి వుంది.  క్లారిటీ థీం అనేది చాలా ముఖ్యం. తులసీవనంలో ఆ క్లారిటీ వుంటుంది. అనిల్ నిజాయితీ తీయడం ఒక ఎత్తైయితే దానికి ఈటీవీ విన్ ప్రోత్సహించడం మరో గొప్ప విషయం. ఇది వారితో నా మొదటి అసోషియేషన్. వేరే భాషల నుంచి సినిమాలు వస్తున్నపడు తెలుగులో కూడా టికెట్లు తెగుతున్నాయి. కథలు బాగా చెబుతున్నారనే బ్రాండ్ ఆ పరిశ్రమలకు క్రియేట్ అయ్యింది. తెలుగులో దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాలనేది నా కోరిక. ఇందులో ఈటీవీ విన్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నాను. దీని కోసమే తులసీవనం తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.

డైరెక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తులసీవనం’ క్యూట్ రొమాంటిక్ కామెడీ. స్మరన్ అద్భుతమైన మ్యూజిక్ తో వేరే లెవల్ కి తీసుకెళ్ళారు. ఇది అందరూ రిలేట్ చేసుకునే కథ. ప్రేమ్ సాగర్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.  రవితేజ గిరిజాల చాలా బ్రిలియంట్ గా ఎడిట్ చేశారు. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నితిన్ సాయి ఈటీవీ టీంకి ధన్యవాదాలు. తరుణ్ ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. నేను తన దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. ఫ్యామిలీల చూసుకునేవారు. తన స్ఫూర్తితోనే దర్శకుడినయ్యాను. తులసీవనం తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘తులసీవనం’ అందరూ రిలేట్ చేసుకునే సిరిస్. తరుణ్ గారితో ఇది మా తొలి అసోషియేషన్ కావడం ఆనందంగా వుంది. టీం అందరికీ థాంక్స్. మార్చి 21న తప్పకుండా చూడండి. సపోర్ట్ చేయండి’ అన్నారు.

అక్షయ్ మాట్లాడుతూ...తులసీ లాంటి ఫ్రెండ్  స్నేహితులందరిలో ఉంటాడు. అందరూ రిలేట్ చేసుకునే కంటెంట్ ఇది. అనిల్ గారు అద్భుతంగా తీశారు. ఇలాంటి పాత్ర ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. తరుణ్ గారు నాకు స్ఫూర్తి. ఈటీవీ విన్, యూనిట్ అందరికీ ధన్యవాదాలు. 21న తప్పకుండా తులసీ వనం చూడండి. మీ అందరినీ అలరిస్తుంది” అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకమాను, విష్ణు  

నిర్మాతలు : స్వాగత్ రెడ్డి, నీలిత పైడిపల్లి, ప్రీతం దేవిరెడ్డి, అనిల్ రెడ్డి, సాయి జాగర్లమూడి, సాయికృష్ణ గద్వాల్, జీవన్ కుమార్, పవన్ కంది
దర్శకత్వం: అనిల్ రెడ్డి
డీవోపీ: ప్రేమ్ సాగర్
సంగీతం: స్మరన్
ఆర్ట్ డైరెక్టర్: అనురాగ్ రెడ్డి, హేమాన్వి దండు
ఎడిటర్: రవితేజ గిరిజాల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కళ్యాణ్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: అనూష పుంజాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షణ్ముఖ్ రావు, వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికపాటి
సాహిత్యం: మనోజ్ కుమార్ జూలూరి, నిక్లేష్ సుంకోజీ
పోస్టర్ డిజైనర్: రాఘవేంద్ర

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago