‘టుక్‌ టుక్‌’ ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ

చిత్రవాహిని మరియు ఆర్‌వైజి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్‌ ‘టుక్‌ టుక్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్‌ చాలా ఆకర్షణీయంగా ఉంది. చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్‌ లుక్‌ ఉంది. సుప్రీత్‌ సి. కృష్ణ దర్శకత్వం వహించిన, ఈ ‘టుక్‌ టుక్‌’ ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్‌ అనుభూతిని అందిచేలా ఉంది. హీరోలు హర్ష రోషన్‌, కార్తికేయ దేవ్‌, స్టీవెన్‌ మధులు ఓ ఆటో బొమ్మను ఎంతో ఆసక్తిగా చూస్తుండడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. అసలు ఆ ఆటో ఏమిటి? ఈ ఆటోకు ఈ చిత్ర కథలో ఉన్న ప్రాధాన్యం ఏమిటి? అనే ఆసక్తిని వీక్షకులకు కలిగిస్తోంది.

ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే.. రాబోయే రోజుల్లో మేకర్స్‌ ఇచ్చే అప్డేట్స్‌ వరకూ ఊపిరి బిగబట్టుకుని వెయిట్‌ చేయాల్సిందే.
తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఉన్న కంటెంట్‌ను బట్టి ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో సెట్‌ చేయబడిరది అని అర్ధమౌతుంది. అనేక ఫాంటసీ ఎలిమెంట్స్‌ కూడా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. రాహుల్‌ రెడ్డి, లోక్కు సాయి వరుణ్‌ మరియు శ్రీరాములు రెడ్డి నిర్మించిన ‘టుక్‌ టుక్‌’ క్రియేటివ్‌ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్‌లో హీరోనో, హీరోయిన్‌నో కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులకు క్యూరియాసిటీని పెంచుతుంది. దీనికి సంతు ఓంకార్‌ సంగీతం అందించారు. హార్థిక్‌ శ్రీకుమార్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ‘టుక్‌ టుక్‌’ ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్‌ రైడ్‌గా ఎక్స్పీరియన్స్‌ చెయ్యడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నట్టు ఈ పోస్టర్‌ రెస్పాన్స్‌ బట్టి అర్ధమవుతుంది.

తారాగణం: హర్ష రోషన్‌, కార్తికేయ దేవ్‌ , స్టీవెన్‌ మధు , సాన్వీ మేఘన
నిహాల్‌ కోధాటి

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్‌ కృష్ణ
సినిమాటోగ్రాఫర్‌: కార్తీక్‌ సాయికుమార్‌
సంగీతం: సంతు ఓంకార్‌
ఎడిటర్‌: అశ్వత్‌ శివకుమార్‌
నిర్మాతలు:
రాహుల్‌ రెడ్డి
లోక్కు శ్రీ వరుణ్‌
శ్రీరాముల రెడ్డి
సుప్రీత్‌ సి కృష్ణ
పి ఆర్‌ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు
డిజిటల్‌ మీడియా : పిక్చర్‌ పిచ్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago