సిటాడెల్: హనీ బన్ని ట్రెయిలర్ ను విడుదల చేసింది

Must Read

సిటాడెల్: హనీ బన్ని భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా 240 పైగా దేశాలు మరియు భూభాగాలలో నవంబరు 7 నాడు ప్రైమ్ వీడియోపై ప్రత్యేక ప్రీమియర్ గా ప్రసారం చేయుటకు అంత సిద్ధం అయ్యింది.

ఈ ట్రెయిలర్ 90’s యొక్క కథనము చుట్టూ సెట్ చేయబడిన ఉల్లాసభరితమైన మరియు ఆకట్టుకునే స్పై థ్రిల్లర్. ఇందులో అసాధారణమైన ప్రదర్శనలు మరియు భారీ విజువల్ స్కేల్ తో విధ్వంసకరమైన యాక్షన్, అత్యధిక శక్తివంతమైన స్టంట్స్ మరియు మిమ్మల్ని కట్టిపడేసే ఉత్కంఠతలు ఉన్నాయి. స్టంట్‎మాన్ బన్ని (వరుణ్ ధావన్) ఒక సైడ్ గిగ్ కొరకు పోరాడుతున్న నటి హనీ (సమంత) ని నియమిస్తాడు. వాళ్ళు యాక్షన్, గూఢచర్యం మరియు ద్రోహాల ప్రపంచములో ఇరుక్కుపోతారు. కొన్ని సంవత్సరాల తరువాత, వారి ప్రమాదకరమైన గతము ముందుకు వచ్చినప్పుడు, దూరమైన హనీ మరియు బన్ని కలిసి వారి కూతురు నదియాను రక్షించేందుకు పోరాడుతారు.

“టీజర్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో, ఈ షో కొరకు ఆసక్తి మరియు ఎదురుచూపులు ప్రతి రోజు పెరుగుతూ వచ్చాయి, వరుణ్, సమంత మరియు రాజ్ & డికే ఫ్యాన్స్ నవంబరు 7 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారికి సిటాడెల్: హనీ బన్ని అద్భుత ప్రపంచాన్ని జయించిన ఈ షో యొక్క యాక్షన్-నిండిన ట్రెయిలర్ తో సీరీస్ గురించిన సమాచారాన్ని అందించుటకు ఇది సరైన సమయము అని మాకు అనిపించింది. ఈ అత్యధిక-శక్తివంతమైన స్పై థ్రిల్లర్ కు రాజ్ & డికే వారి చమత్కారాన్ని చేర్చారు. ఇది మా ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది,” అని నిఖిల్ మధోక్, హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో అన్నారు.

“సిటాడెల్: హనీ బన్ని మాకు ఇదివరకు ఎన్నడు చేయని లేదా ప్రయత్నించని ఒక అపూర్వమైన గూఢచారులు మరియు గూఢచర్యం ప్రపంచములో ఒక భాగం అయ్యే అవకాశం ఇచ్చిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇంతవరకు మేము మా ప్రాజెక్ట్స్ అన్నిటిని నిర్మించాము కాని సిటాడెల్: హనీ బన్ని మా మొట్టమొదటి కొలాబొరేషన్. రుస్సో బ్రదర్స్ వంటి సృజనాత్మక శక్తులు మరియు ప్రపంచములోని ప్రతిభగల చిత్రనిర్మాతలు మరియు సృష్టికర్తలు అందరు కలిసి దీనిని ఒక విలువైన సృజనాత్మక అనుభవముగా చేశాయి,” అని రాజ్ & డికే అన్నారు.

“బన్నీ పాత్ర నేను ఇదివరకు ఎప్పుడు నటించనిది. ఒక గూఢచారిగా, అతను ఒక ద్వంద్వ జీవితాన్ని గడపడమే కాకుండా అతని వ్యక్తిత్వములో రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్నాయి. ఒక నటుడిగా ఇది నాకు చాలా ఆసక్తికరంగా ఉండింది. కథనములో జటిలంగా అల్లబడిన ఆ పాత్ర కొరకు నాకు మిశ్రమ అనుభవాలు మరియు పాత్రలు అవసరమైయ్యాయి, అలాగే మానసికంగా మరియు శారీరికంగా కఠినమైన విన్యాసాలు మరియు యాక్షన్ దృశ్యాల కొరకు సిద్ధం కావలసి వచ్చింది. దీనితో ఇది నాకు సవాలు విసిరిన ప్రదర్శనగా నిలిచింది. బన్నీ పాత్రలో అవకాశం ఇచ్చినందుకు ప్రైమ్ వీడియో, రాజ్ & డికే మరియు AGBO కు నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను” అని వరుణ్ ధావన్ అన్నారు.

సమంత ఇలా అన్నారు, “ఆకట్టుకునే కథనము, గొప్ప పాత్ర ఔచిత్యము మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడే తీవ్రమైన పోరాటాలు మరియు స్టంట్స్ ఉన్న యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టెయినర్ లో ఒక భాగం కావటానికి వచ్చిన అవకాశం, అలాగే కనెక్టెడ్ స్పై కథల సంకలనములో ఒక అంతర్గత పాత్రను పోషించుటకు నన్ను ఈ ప్రాజెక్ట్ వైపుకు ఆకర్షించింది. హెనీ పాత్రలో జీవించడానికి అవసరమైన సవాళ్ళు మరియు ప్రయత్నాలు నాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి, వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా, మరియు ఇది నా కెరీర్ లోనే చాలా ముఖ్యమైన పాత్రగా నిలిచింది. ప్రైమ్ వీడియో పై ప్రసారం అయ్యే ఈ సీరీస్ ను ప్రేక్షకులు భారతదేశములోనే కాకుండా అనేక దేశాలు మరియు భూభాగాలలో ఈ సీరీస్ ను బాగా ఆనందిస్తారని నేను విశ్వసిస్తున్నాను.”

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News