టోవినో థామస్ భారీ బడ్జెట్ చిత్రం ‘నడికర్ తిలకం”

టోవినో థామస్ భారీ బడ్జెట్ చిత్రం ‘నడికర్ తిలకం”తో మలయాళంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్, గ్రాండ్ గా ముహూర్తం వేడుక, కొచ్చిలో షూటింగ్ ప్రారంభం

స్టార్ హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మలయాళంలో అడుగుపెడుతోంది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ టోవినో థామస్‌తో  “నడికర్ తిలకం” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. సంచలన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్‌ని రూపొందించిన లాల్ జూనియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తమ మొదటి మలయాళ చిత్రాన్ని గాడ్‌స్పీడ్‌తో కలిసి నిర్మించనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతలు.

“‘నడికర్ తిలకం” ముహూర్తం వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు కొచ్చిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాని 120 రోజుల పాటు వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. టోవినో థామస్ ఈ చిత్రంలో అనేక సవాళ్ళతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నారు. సౌబిన్ షాహిర్ బాల పాత్రలో కనిపించనుండగా, భావన కథానాయిక.

ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం ఉంది. ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు సినిమా కోసం పని చేస్తున్నారు. ఆల్బీ సినిమాటో గ్రాఫర్ గా  ఉత్కంఠభరితమైన దృశ్యాలను తెరపై ఆవిష్కరించనున్నారు. రతీష్ రాజ్ ఎడిటింగ్  సినిమా అంతటా మనల్ని సీట్ల ఎడ్జ్ లో ఉంచుతుంది. యక్జాన్ గ్యారీ పెరీరా, నేహా నాయర్ సంగీతం సినిమా భావోద్వేగాలకు అనుగుణంగా సరికొత్త అనుభూతిని అందించబోతుంది. ప్రొడక్షన్ డిజైనర్ ప్రశాంత్ మాధవ్ కథకు తగిన అద్భుతమైన సెట్‌లను రూపొందించారు.

తారాగణం: టోవినో థామస్, భావన, సౌబిన్ షాహిర్, ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్, బాలు వర్గీస్, సురేష్ కృష్ణ, ఇంద్రన్స్, మధుపాల్, గణపతి, అల్తాఫ్ సలీం, మణికుట్టన్, శ్రీజిత్ రవి, సంజు శివరామ్ , అర్జున్, వీణా నందకుమార్, ఖలీద్ రెహమాన్, ప్రమోద్ వెలియనద్, ఇడవల బాబు, బైజుకుట్టన్, అరుణ్ కురియన్, షాన్ జేవియర్, రజిత్ (బిగ్ బాస్ ఫేమ్), బిపిన్ చంద్రన్, మాలా పార్వతి, దేవికా గోపాల్ నాయర్, ఆరాధ్య, అఖిల్ కన్నపన్, ఖయాస్ ముహమ్మద్, జజీర్ ముహమ్మద్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: లాల్ జూనియర్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అలన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, గాడ్‌స్పీడ్
డీవోపీ: ఆల్బీ
సంగీతం: యక్జాన్ గారి పెరీరా, నేహా నాయర్
స్క్రీన్ ప్లే: సువిన్ ఎస్ సోమశేఖరన్
ఎడిటింగ్: రతీష్ రాజ్
ప్రొడక్షన్ డిజైనర్: ప్రశాంత్ మాధవ్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

11 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago