టోవినో థామస్ అజయంతే రందం మోషణం (ఎఆర్ఎం) టీజర్ లాంచ్.. మొదటి పాన్ ఇండియా విడుదలకు సిద్ధమౌతున్న టోవినో థామస్
తన సూపర్ హీరో మూవీ మిన్నల్ మురళితో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మలయాళ నటుడు టోవినో థామస్ తన మొదటి పాన్-ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా వున్నారు. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ‘అజయంతే రందం మోషణం’ (ARM) టీజర్ ఈ రోజు అన్ని సౌత్ లాంగ్వేజెస్, హిందీలో కూడా విడుదలైంది.
పాన్ ఇండియా అప్పీల్‌కు అనుగుణంగా.. ఎఆర్ఎం టీజర్ సోషల్ మీడియాలో గ్రాండ్ లాంచ్ అయ్యింది. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్ కోసం ఇండియన్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి , పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి వచ్చారు.
హిందీ టీజర్‌ను హృతిక్ రోషన్ లాంచ్ చేయగా, తెలుగులో నాని, తమిళంలో లోకేష్ కనగరాజ్, ఆర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లాంచ్ చేశారు. ఎఆర్ఎం ని సుజిత్ నంబియార్ రాశారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM ప్రొడక్షన్స్ పై డాక్టర్ జకరియా థామస్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.
ఈ టీజర్ ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. టొవినో థామస్ పొడుగాటి జట్టుతో రగ్గడ్ అండ్ ఇంటెన్స్ అవతార్ లో కనిపించారు. ఒక చిన్న అమ్మాయి తన అమ్మమ్మని దొంగ గురించి కథ అడగడంతో టీజర్ మొదలవుతుంది. ప్రజలు దేవుడిని ప్రార్థించే సమయంలో ఆ దొంగ గురించి ఎందుకు? అని అమ్మమ్మ మనరాలని మందలిస్తుంది. తరువాతి సన్నివేశంలో.. ఒక గ్రామంలో ఒక సమస్యవుండటం, గ్రామంలోని ప్రజలు ఏదో అద్భుతం జరుగుతుందా అని ఎదురుచూడటం, తర్వాత వచ్చే సన్నివేశాల్ని ఎక్స్ టార్డినరీగా చూపించారు.
టోవినోతో పాటు, కృతి శెట్టి , ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలో మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల కానుంది.
దర్శకత్వం : జితిన్ లాల్
రచన: సుజిత్ నంబియార్
నిర్మాత: డా. జచారియా థామస్, లిస్టిన్ స్టీఫెన్
బ్యానర్: మ్యాజిక్ ఫ్రేమ్‌లు & UGM ప్రొడక్షన్స్
సంగీతం & BGM: ధిబు నినాన్ థామస్
ఫోటోగ్రఫీ డైరెక్టర్: జోమోన్ టి జాన్ ISC
ఎడిటర్: షమీర్ మహమ్మద్
పీఆర్వో– వంశీ శేఖర్
డిజిటల్ మార్కెటింగ్: దిలీప్ లెక్కల & తనయ్ సూర్య
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…