హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను ఈ నెల 26వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఇటీవల విడుదల చేసిన “తుఫాన్” ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మాటల, పాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ – “తుఫాన్” ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ కు వచ్చిన మీ అందరికీ వెల్కమ్. మేఘా ఆకాష్ లాంటి అందమైన అమ్మాయి, విజయ్ ఆంటోనీ లాంటి హీరో ఉన్న తర్వాత నా మాటలు మీలో ఎవరూ వినరు. మీరంతా విజయ్ ఆంటోనీ మాటలు వినేందుకు వెయిట్ చేస్తున్నారని తెలుసు. “తుఫాన్” ఒక మంచి సినిమా. మీరంతా విజయ్ ఆంటోనీ గారి బిచ్చగాడు సినిమాను ఎంతగా ఎంజాయ్ చేశారో “తుఫాన్” సినిమాను కూడా అలాగే ఆస్వాదిస్తారు. అన్నారు.
నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా టీజర్, ట్రైలర్ మీరంతా చూశారు. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నా. ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను ఇలా మీ అందరి మధ్యలో గ్రాండ్ గా నిర్వహించాలని కోరుకున్నాం. మీరంతా వచ్చినందుకు సంతోషంగా ఉంది. “తుఫాన్” సినిమా యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని అంశాలతో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లాగే సినిమానూ మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ నెల 26వ తేదీన “తుఫాన్” సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. అన్నారు.
డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేసుకోవడం సంతోషంగా ఉంది. నాకు ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్క కు, విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. మేఘా ఆకాష్ ఈ మూవీలో చాలా బాగా నటించింది. భాష్యశ్రీ గారు “తుఫాన్” స్ట్రైట్ తెలుగు సినిమా అనేంత బాగా రచన చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. “తుఫాన్” మూవీ మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.
హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ – మా “తుఫాన్” మూవీ టీమ్ మీద మీరంతా చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కు థ్యాంక్స్. “తుఫాన్” నా కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ. ఈ సినిమాలో లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్, మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. మీ అందరినీ థియేటర్స్ లో ఎంటర్ టైన్ చేసేందుకు ఈ నెల 26వ తేదీన రిలీజ్ కు వస్తున్నాం. ఈ సినిమాలో విజయ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తప్పకుండా “తుఫాన్” మూవీ చూడండి. అన్నారు.
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – మీరంతా చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ కు చాలా థ్యాంక్స్. హైదరాబాద్ లో త్వరలో ఒక లైవ్ కాన్సర్ట్ చేస్తాను. “తుఫాన్” ను ఈనెల 26న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మీతో కలిసి నేనూ ఈ సినిమా థియేటర్స్ లో చూడాలని అనుకుంటున్నా. “తుఫాన్” వంటి మంచి మూవీ నాకు ఇచ్చిన దర్శకుడు విజయ్ మిల్టన్ గారికి థ్యాంక్స్. ఆయన అద్భుతమైన దర్శకుడే కాదు సినిమాటోగ్రాఫర్ కూడా. “తుఫాన్” సినిమాకు ఎక్స్ లెంట్ విజువల్స్ క్యాప్చర్ చేశారు. ఈ సినిమా నేపథ్యం కొత్తగా ఉంటుంది. మేఘా నేనూ పెయిర్ గా ఆకట్టుకుంటాం. మీరంతా “తుఫాన్” సినిమాను ఎంజాయ్ చేస్తారు.
నటీనటులు – విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ – షిమోనా స్టాలిన్
డిజైనర్ – తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ – సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – అరుముగస్వామి
ఎడిటింగ్ – ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ – అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ – భాష్య శ్రీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు – కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ – విజయ్ మిల్టన్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…